May Day Call for Workers’ Rights
కార్మికుల హక్కులన్నీ పోరాటం ద్వారా
దక్కుతాయని చాటినరోజు
కార్మిక వర్గ పోరాటదినం “మే డే” ను జయప్రదం చేయండి
ఏ సి సి టి యు జిల్లా కార్యదర్శి కన్నూర్ డానియల్
సిపిఐ ఎంఎల్ టేకుమట్ల మండల కార్యదర్శి అంబాల అశ్వద్ధామ
భూపాలపల్లి నేటిధాత్రి
140 సంవత్సరాల క్రితం అత్యంత అమానవీయ పరిస్థితులలో కార్మికుల చేత పని చేయించడం, నిర్ణీత పనిగంటలు లేకపోవడం, న్యాయబద్ధమైన వేతనాలు లేకపోవడం యదేశ్ఛగా కార్మికులను తమ ఇష్టానుసారం దోచుకోవడం కార్మికులను పశువులు లాగా వ్యవహరించిన దానికి వ్యతిరేకంగా కార్మికవర్గం తమ మధ్యనున్న జాతి, మత, వర్గ తేడాలను ప్రక్కనపెట్టి పోరాడిన రోజు ఈ మేడే అని వారు అన్నారు ఏ సి సి టి యు జిల్లా కార్యదర్శి కన్నూర్ డానియల్
సిపిఐ ఎంఎల్ టేకుమట్ల మండల కార్యదర్శి అంబాల అశ్వద్ధామ ఈ సందర్భంగా మాట్లాడుతూ
ఎనిమిది గంటల పనిదినం మెరుగైన పని పరిస్థితులు, స్త్రీ, పురుషులు సమాన వేతనాలను డిమాండ్ చేస్తూ, అరెస్ట్‌లను, తూటాలను. జైళ్ళను ధిక్కరించి పోరాడిన దినం మేడే… ఎర్రజండా సృష్టించిన రోజు ఈ మేడే… నేడు మన దేశంలో అధికారంలో మోడి బిజెపి ప్రభుత్వం దశాబ్దాలుగా కార్మికవర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాసి కార్పోరేట్లకు అనుకూలమైన 4 లేబర్ కోడ్లను అమలు చేస్తున్నది. 140 సంవత్సారాల క్రితం నాటి అటవిక పరిస్థితుల వైపు తీసుకువెళ్లటానికి ప్రయత్నిస్తున్నది. ఎనిమిది గంటల పనిదినాన్ని కాలరాసి పనిగంటలను పెంచివేసింది. కార్మికులకు కనీస వేతనాలు కూడా అనేక రంగాలలో అమలు చేయడం లేదు. ఇటీవల బిజెపి పాలిత రాష్ట్రమైన డిల్లి నొయిడాలో కార్మికుల పోరాటమే దీనికి నిదర్శనం. విజయవంతంగా మేడనుజయప్రదం చేయాలని కార్మిక వర్గాన్ని పిలుపునిస్తున్నాం… సాద రమేష్ బండి కుమారు సాదా మహేందర్ శ్రావణ్ శ్రావణ్ సుధాకర్ కార్మికుల పాల్గొన్నారు
