CPI Marks 141st May Day in Bellampalli
భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో 141 వ మేడే కార్మిక దినోత్సవం వేడుకలు.
బెల్లంపల్లి నేటిధాత్రి :
దినోత్సవాన్ని కామ్రేడ్ బాసెట్టి గంగారం లో విజ్ఞాన భవనంలో చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆడపు రాజమౌళి పతాకావిష్కరణ చేశారు పట్టణ కార్యదర్శి మాట్లాడుతూ ఈరోజు చికాగో అమరవీరులు 12 గంటల పని విధానాన్ని రద్దుచేసి ఎనిమిది గంటల పని కోసం తమ ప్రాణలు త్యాగo చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా చేసి కార్మికులకు తీరని అన్యాయం చేస్తుందని దీనికి తాము వ్యతిరేకం అన్నారు. కార్మికుల హక్కుల కొరకు తాము పోరాటం చేస్తామని, ప్రజల జీవన విధానం పై భారాన్ని మోపే పద్ధతులను మార్చుకోవాలని ప్రజలకు అన్యాయం చేస్తే సహించబోమని, భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలో వివిధ వార్డుల్లో తమ కామ్రేడ్స్ మేడే పతాకావిష్కరణ గావించారు. భగత్ సింగ్ విగ్రహం దగ్గర నియోజకవర్గ కార్యదర్శి దాగం మల్లేష్, రైల్వే స్టేషన్ లో రాష్ట్ర సమితి సభ్యురాలు బొల్లం పూర్ణిమ,శాంతిఖనిలో గౌతూరి కిష్టయ్య , తొమ్మిదవ వార్డు రైల్వేస్టేషన్లో అక్కేపల్లి బాపు, 26 వార్డులో కాసిపేట స్వర్ణలత,పాత బస్టాండ్ లో బొల్లం తిలక్ అంబేద్కర్,అశోక్ నగర్ లో జూపాక కొమురయ్య ,సింగరేణి హాస్పిటల్ లో డి ఆర్ శ్రీధర్ ప్రతావిష్కరణ చేశారు.సింగరేణి హాస్పిటల్ లో రోగులకు పండ్లు పంపిణి చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్ప నరసయ్య, బ్రాంచ్ సహాయ కార్యదర్శి దాసరి తిరుపతి గౌడ్, మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, జిల్లా సమితి సభ్యులు రత్నం రాజం, జి,సీ మాణిక్యం,కొంకుల రాజేష్ కాసిపేట కార్యదర్శి మీనుగు లక్ష్మీనారాయణ పట్టణ కార్యవర్గ సభ్యులు మంతెన రమేష్ , బియ్యాల ఉ పేందర్,బొంకూరి రాంచందర్, మహిళా సమఖ్య జిల్లా అధ్యక్షులు బొల్లం సోని, నాయకులు స్వామి దాస్,రత్నం ఐలయ్య,రాజేందర్ ,మహేందర్ రెడ్డి, రాధాకృష్ ,అందుకుల రాజేందర్,తదితరులు పాల్గొన్నారు.
