Lakshmi Narasimha Swamy Jayanthi Celebrations
శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు
వనపర్తి నేటిదాత్రి .
https://youtu.be/jp-HZuaI9Rs?si=YQ0WkYxtxYJhfZdB
వనపర్తి జిల్లా కేంద్రం శoకర్ గుంజ్ లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా గురువారం నుండి శుక్రవారం వరకు ప్రత్యేక పూజలు ఉంటాయని ఆలయ కమిటీ నిర్వాహకులు దాచ లక్ష్మీనారాయణ దాచ శివ న్యాయవాది దార వెంకటేష్ లగిశెట్టి శ్రీకాంత్ నూకల విజయ్ నూకల నాగరాజ్ చిట్యాల నరసింహ ఈపూరి వెంకటేష్ ఆలయ పురోహితులు వెంకటేశ్వర శర్మ ఒక ప్రకటనలో తెలిపారు గురువారం ఉదయం 8 గంటల నుండి అభిషేకం మంత్రపుష్పం ప్రత్యేక పూజలు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదం సాయంత్రం శ్రీ లక్ష్మీనరసింహ సహస్ర నామ లక్ష పుష్పార్చన మంత్రపుష్పం తీర్థ ప్రసాద వినియోగం శుక్రవారం లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం ఉదయం 10 . 45 నుండి ప్రారంభం అనంతరం తీర్థప్రసాదాలు అన్న ప్రసాదం ఉంటుందని వారు పేర్కొన్నారు సాయంత్రం 6 గంటల నుండి శ్రీ స్వామి వారి ఊరేగింపు పల్లకి సేవ ఉంటుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ లక్ష్మీనరసింహస్వామి కృప కు పాత్రలు కావాలని వారు కోరారు
