అధికారులు పెట్టే చిల్లులు చూడాలి?
`బస్తా నిండేది లేదు.. సివిల్ సప్లైకి రూపాయి ఆదాయం రాదు?
`ప్రభుత్వం అప్పులు చేసి కొనుగోలు చేయక తప్పదు?
`సివిల్ సప్లై అంటేనే ఆదాయం సున్న.. ఖర్చు మిన్న?
`రైతు బతికింది లేదు… అప్పుల నుంచి బైట పడింది లేదు?
`ఆరు గాలం కష్టపడినా రైతుకు పెద్దగా లాభం లేదు!
మిల్లర్లు..అధికారులు కోట్లకు తక్కువ లేరు!
రైతులకు మేలు చేయాల్సిన అధికారులు మిల్లర్లకు సపోర్ట్!
`వచ్చే లాభాలలో మిల్లర్లు, అధికారులు కలిసి వాటాలు!
డీటీ నుంచి డిఏం దాకా కోట్లు సంపాదించుకుంటున్నారు?
చేతులకు వడ్లు అంటకుండా నోట్లు లెక్క బెట్టుకుంటున్నారు!
మిల్లుల్లో అధికారులు పార్టునర్లు అవుతున్నారు?
మిల్లర్లు, అధికారులు కలిసి పౌర సరఫరా శాఖను పాతర పెడుతున్నారు!
`నిజాయితీ మిలర్లకు చుక్కలు చూపిస్తున్నారు?
అధికారులకు మిల్లుల్లో అనధికారిక వాటాలు?
ఆ మిల్లులకే లెక్క లేకుండా వడ్లు?
`అధికారులు,మిల్లర్లు కలిసి బోనస్ కూడా బోంచేస్తున్నారు!
`అధికారులు వడ్లలో మట్టి పెళ్లను కూడా వదలడం లేదు!
పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వడ్లను తెలంగాణా రైతుల పేర రాస్తున్నారు?
తెలంగాణా లో పండే వడ్లకు, అధికారుల లెక్కలకు పొంతన కుదరడం లేదు!
`బోనస్ బోకెందుకు కూడా అధికారులు వెనుకాడడం లేదు!
సివిల్ సప్లై అధికారుల మీద నిఘా లేదు?
`వాళ్లపై నియంత్రణ అసలే లేదు!
`అందుకే అధికారులు ఆడింది ఆట పాడింది పాట!
సివిల్ సప్లై శాఖ అధికారుల సంపాదన మించి వున్న ఆస్తుల మీద నిఘా పెట్టాలి?
ఏసీబీ అధికారులు ఇప్పటికైనా రంగంలోకి దిగాలి?
`సివిల్ సప్లై లో అడుగడుగునా జరిగే అవినీతిని అరికట్టాలి!
`మిలర్ల అక్రమ దందా మీద దృష్టి పెట్టాలి!
అందుకు సహకరిస్తున్న అధికారుల భరతం పట్టాలి!
`ప్రభుత్వాదాయానికి గండి పడకుండా చూడాలి.
హైదరాబాద్, నేటిధాత్రి:
ఆ శాఖకు పేరు గొప్ప..ఊరు దిబ్బ సామెత సరిగ్గా సరిపోతుంది. అంతా సవ్యంగానే కనిపిస్తుంది. మొత్తం అస్తవ్యవస్తంగానే వుంటుంది. అసలు ఆ శాఖలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్దంకాదు. ఎవరూ అర్దం చేసుకోలేరు. ఎంత ప్రయత్నం చేసినా అంతు చిక్కడు. ఐదేళ్లు మంత్రిగా పనిచేసిన నాయకులకు కూడా ఏది అంతు చిక్కదు. ఆ శాఖ మీద పట్టురాదు. ఆ శాఖ అంటే అంతే..ఎవరికీ అంతుపట్టదంతే..ఈ శాఖకు జీవిత కాలం కమీషనర్‌గా పనిచేసినా, ఆ శాఖను గాడిలో పెట్టలేదు. అంత క్లిష్టమైనది. సంక్లిష్టమైనది. అవినీతికిలో అన్ని శాఖలకన్నా ముందుంటుంది. కాని ఎక్కడా కంటికి కనిపించకుండా గుట్టుగా సాగుతుంది. అలాంటి శాఖలో వడ్ల బస్తా కొనుగోలు నుంచి మొదలు, అన్నీ తూట్లే..అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. కాని ఎక్కడా ఎవరికీ కనిపించదు. ప్రభుత్వం గోడు కూడా ఎవరూ పట్టించుకోరు. నిజం చెప్పాలంటే పౌరసరఫరాల శాఖ అనేది ప్రభుత్వాలకు కామదేనువు లాంటిది. కల్ప వక్షం లాంటిది. కాని అది ఎప్ప్పుడూ ఒట్టిపోయే కనిపిస్తుంది. కారణం..అధికారులు…మిల్లర్లు. అందుకే అంతు చిక్కని రహాస్యాలన్నీ మధ్యలోనే మాయమైపోతాయి. ప్రభుత్వం ఖజాన నింపాల్సిన శాఖ, ఖజానా ఖాళీచేయిస్తుంది. రూపాయి ఆదాయం కనిపించకుండా చేస్తుంది. ఇంతటి చిత్రమైన శాఖ మరొకటి వుండదేమో! ప్రతి అడుగులోనూ అవినీతే. అక్రమమే. కాని ఎవరికీ కనిపించదు. ఎక్కడా అవినీతి జరుగుతున్నట్లు తెలియదు. అంతా సవ్యంగా సాగుతున్నట్లు మాత్రమే వుంటుంది. సహజంగా రెవిన్యూశాఖ, రిజిస్ట్రేషన్ శాఖల్లో అవినీతి గురించి మాట్లాడుతుంటారు. అక్కడ అవినీతి కనిపిస్తుంది. పైగా ప్రభుత్వానికి ఎంతో కొంత ఆదాయం సమకూరుతుంది. కాని ఇక్కడ అంతా అవినీతే నిండుతుంది. ప్రభుత్వాదాయానికి గండిపడుతుంది. అది కూడా పూడ్చలేనంత గండి తెచ్చిపెడుతుంది. అధికారులు ఆ శాఖకు పెట్టే చిల్లులు అన్నీ ఇన్నీ కావు. ఏకంగా పదుల సంఖ్యలో ఎక్కడిక్కడ అధికారులు, మిల్లర్లు కలసి దోచుకుంటారు. కోట్లు కూడబెట్టుకుంటారు. ప్రభుత్వానికి ఒక్క రూపాయి ఆదాయం చూపరు. పైగా ప్రభుత్వం నుంచే మళ్లీ, మళ్లీ డబ్బులు ఖర్చు చేయిస్తుంటారు. ఇలా ఏటా ప్రభుత్వం కొన్ని వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ఆ సొమ్మును సివిల్ సప్లయ్శాఖతోపాటు, మిల్లర్లు పక్కదారి పట్టిస్తుంటారు. రైతులకు చెందాల్సిన సొమ్మును నొక్కేస్తుంటారు. ప్రభుత్వంతో అనవసరమైన ఖర్చులు చేయిస్తుంటారు. గోనె సంచులు ( గన్నీ బ్యాగులు) కొనుగోలు నుంచి మొదలు అన్నింట్లోనూ అవినీతే జరుగుతుంది. అవసరం లేకున్నా బ్యాగులను కొనుగోలు చేస్తుంటారు. పదే పదే రైతులు చేత బ్యాగులు లేవని అనిపిస్తారు. రైతులకు బ్యాగులు అందుబాటులో లేకుండాపోవడం సమస్యగా మార్చి, కొనుగోలు చేస్తారు. వడ్ల రవాణాలో కూడా అంచనాలకు మించి ఖర్చు చేస్తారు. రైతులకు రూపాయి చెల్లించకుండా మొత్తం మిల్లర్లు, అదికారులు కలిసి మింగేస్తారు. కాని ఇది ఎక్కడా కనిపించదు. కాని దాని వెనుక వందల కోట్ల అవినీతి జరగుతుంది. వడ్ల కేటాయింపుల్లో కూడా చెప్పలేనంత అవినీతి దాగి వుంటుంది. ఏ మిల్లుకు ఎంత వడ్లు పెడుతున్నారన్న సంగతి అదికారులకు తప్ప ఎవరికీ తెలియదు. రసీదుల్లో కనిపించే లెక్కలకు , వడ్ల కేటాయింపులకు పొంతనే వుండదు. ఐకేపి సెంటర్లలో తూకాల మోసాలు ఎవరికీ అర్దం కావు. అదికారులు, మిల్లర్ల కనుసైగల్లోనే సాగుతుంటాయి. ఆఖరు వడ్ల కొనుగోలులో జరిగే అవినీతి ఎవరికీ కనిపించదు. ప్రభుత్వం దష్టికిపోదు. అదికారులు ఎవరికీ సమాధానం చెప్పరు. పైగా ఎవరూ వాటిని అంచనా వేయలేరు. బఫర్ గోడౌన్లకు కేటాయింపులు, రేషన్ షాపులకు కేటాయింపులు ఎలా ఎక్కడ చూసినా తూట్లే కనిపిస్తాయి. ఆఖరుకు ఎఫఆర్కే లోనే కాదు, రైతులకు చెల్లించే బోనస్‌లలో బోగస్ రసీదులు తయారు చేస్తారు. పొరుగు రాష్ట్రాల నుంచి రైతులు తెచ్చిన వడ్లను తెలంగాణ రైతుల పేరు మీద రాసి బోనస్‌లు కూడా అదికారులు, మిల్లర్లు పంచుకుంటున్నారని తెలుస్తోంది. ఇన్ని రకాల అవినీతి వ్యవహారాలు సాగుతున్నా ఆ శాఖ మీద అవినీతి నిరోధక శాఖ దష్టిపెట్టదు. అక్కడ నేరుగా ఎవరి పిర్యాదులు పెద్దగా అందవు. అందుకే ఆ శాఖ మీద ఎవరికీ అనుమానం రాదు. కాని కొండంత అవినీతి జరుగుతోంది. ప్రభుత్వ ఖజానాకు చిల్లు పడుతుంది. ఈ అవినీతి అధికారులు, మిల్లర్లు కలిసి పార్టునర్లుగా మరేంత దాకాచేరింది. మిల్లుల్లో కొంత మంది అదికారులు అనధికార పార్టునర్లుగా చెలామణి అవుతున్నారు. మిల్లు ఏర్పాటులో అధికారులది ఏ హస్తం వుండదు. కాని మిల్లుల్లో మాత్రం పార్టునర్ షిప్ సాగుతుంది. అదికారులు ఏ మిల్లుకు ఎన్ని వడ్లు కేటాయించాలో అనేదానికి ఎలాంటి దిశా నిర్ధేశం లేదు. నిబంధనలు అసలే లేవు. అందువల్ల అదికారులు తమకు నచ్చిన మిల్లులకు కావాల్సినంత వడ్లు కేటాయిస్తుంటారు. అంటే స్లీపింగ్ పార్టునర్లుగా వున్న మిల్లులకు శక్తికి మించి వడ్లు కేటాయిస్తుంటారు. వచ్చిన లాభంలో కూడా చెరి సంగం పంచుకుంటుంటారు. ఇలా తెలంగాణలోని అన్ని జిల్లాలోనూ ఇదే సాగుతోంది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ ఎంతో మంది అదికారులు ఇలా మిల్లుల్లో పార్టునర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది ఆ మిల్లర్లకు, ఆ అదికారులకు తప్ప మూడో వ్యక్తికి తెలియకుండా జాగ్రత్త పడుతుంటారు. గత ఏడెనమిది సంవత్సరా కాలంగా సివిల్ సప్లై శాఖలో అదికారులకు పెద్దగా ట్రాన్స్ఫర్లు లేవు. ఒకటో, అరో తప్ప పదేళ్లుగా పాతుకుపోయిన అదికారులే అంతటా వున్నారు. వాళ్లు క్రమంగా మిల్లర్లతో కుమ్మక్కైపోతూ వస్తున్నారు. ఆఖరుకు మిల్లుల్లో స్లీపింగ్ పార్టునర్లు అవుతున్నారు. దాంతో స్వామి కార్యం, స్వకార్యం పూర్తి చేసుకుంటున్నారు. ఇటు జీతాలు, అటు లంచాలు, మిల్లుల నుంచి ఆదాయాలు సమకూర్చుకుంటున్నారు. డిటి స్దాయి నుంచి డిఎం స్దాయి వరకు వున్న అనేక మంది అదికారులు కోట్లకు పడగలెత్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సిఎం. రేవంత్‌రెడ్డి ఎంతో ఉదారతతో రైతుల సంక్షేమం కోసం బోనస్ ప్రకటించారు. అందిస్తున్నారు. అయితే అసలు బోనస్ కన్నా, కొసరు బోనస్‌లు ఎక్కువౌతున్నాయి. ప్రభుత్వ ఖజానాకు గండిపడుతున్నాయి. తెలంగాణలో పండే పంటకు, ప్రభుత్వం కొనుగోలు చేసే పంట లెక్కలకు పొంతన వుండడం లేదు. పైగా బోనస్‌లలో కూడా అసలు లెక్క తేలడం లేదు. పొరగు రాష్ట్రాలనుంచి వచ్చే వడ్లకు కూడా బోనస్‌లు రాసి, అధికారులు, మిలర్లు పంచుకుంటున్నారు. తెలంగాణ రైతుల పేరు మీద వడ్లు కొనుగోలు చేస్తున్నారు. దాంతో ప్రభుత్వం అంచనాకు మించి, బోనస్ నిధులు విడుదల చేయాల్సి వస్తోంది. అందుకే ఈ అవినీతి బాగోతాలను బైట పెట్టాలంటే అవినీతి నిరోధక శాఖ రంగంలోకి దిగాల్సిన అవసరం వుంది. సివిల్ సప్లై శాఖ అదికారుల మీద నియంత్రణ ఎప్ప్పుడూ లేదు. నిఘా అసలే లేదు. రైతులు పిర్యాధులు చేసే పరిస్దితి లేదు. మిల్లర్లు, అదికారుల కలిసి పోవడం వల్ల ఎవరితోనూ ఎవరికి ఇబ్బందులు రావడం లేదు. మిల్లర్లు అవతవకలు జరిగేలా అదికారులే ప్రోత్సహిస్తున్నప్ప్పుడు సమస్యలు వచ్చే అవకాశం లేదు. ఉభయ కుశలోపరి అన్నట్లు మిల్లర్లు, అదికారులు కలిసి సాగుతున్నారు. అవినీతి బైటకు పొక్కకుండా చూసుకుంటున్నారు. కోట్లు వెనకేసుకుంటున్నారు. మిల్లర్లు తప్ప్పు చేస్తే చర్యలు తీసుకోవాల్సిన కొంత మంది అదికారులు మిల్లర్లతో చేతులు కలిపారు. మిల్లర్ల సమస్యలు పరిష్కరించపోతే అదికారుల మీది తిరగబడేవారు. ఇప్ప్పుడు అదికారులు, మిల్లర్ల మధ్య సమస్యలకు తావే లేదు. దాంతో సివిల్ సప్లైలో ఏది బైటకు పొక్కదు. మిల్లర్లంటే వ్యాపారులు. అదికారులకు జీతాలు తప్ప మరో మార్గం వుండదు. కాని సివిల్ సప్లై అదికారులకు ఎలా కోట్లకు పడగలెత్తుతున్నారు. అంటే ఇన్ని రకాల అవినీతికి అదికారులు నేరుగా పాల్పడుతున్నారు. ప్రభుత్వానికే తెలియకుండా సొమ్మును దిగమింగుతున్నారు. అందువల్ల ఆదాయానికి మించి ఆస్దులున్న సివిల్ సప్లై శాఖ అదికారుల మీద ఏసిబి దష్టి సారించాలి. కోట్లు సంపాదిస్తున్న అధికారుల సొమ్మును జప్తు చేయాలి. సివిల్ సప్లైలో చిన్న చిన్న అదికారులు కూడా తిరుగుతున్న కార్లును చూస్తేనే అర్దమౌతుంది. ఒక్కసారి ఆ శాఖ మీద దష్టిపెడితే అవినీతి కొండలు, అనకొండలు, తిమింగళాలు బైటకొస్తాయి.
