Heat Woes at Vaccination Center in Siricilla
మండుటెండలో పసిపాపలు పట్టించుకోని ప్రభుత్వ అధికారులు…
నేటి ధాత్రి.
రాజన్న సిరిసిల్ల తంగళ్ళపల్లి…
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ వైద్యశాలలో. పిల్లలకు ప్రత్యేకంగా వ్యాధి నిరోధక టీకాలు. వేసే ప్రత్యేకంగా ఒక యూనిట్ ఏర్పాటు చేశారు కొన్ని సంవత్సరాల నుండి ఇలాగే నడుస్తూ ఉంది. పుట్టినప్పటి నుండి పిల్లలకు ప్రభుత్వ సూచనల మేరకు వ్యాధి నిరోధక టీకాలు. ప్రభుత్వ ఆసుపత్రికి వస్తూ ఉంటారు పిల్లలకు వ్యాక్సిన్లు వేయించు.కోవడానికి వచ్చే పిల్ల ల.తల్లులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని వారు వాపోతున్నారు. అలాగే ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సిరిసిల్ల ప్రాంతీయ వైద్యశాల అంతే ఎంతో పేరు ఉండేది అందులో భాగంగా సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఫ్యామిలీ ప్లానింగ్ సెంటర్ అని సపరేట్ డిపార్ట్మెంట్ అనగా .DMHO. పరిధిలో ఉండే విభాగం ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక యూనిట్ గా పని చేస్తూ ఉండేది అందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునికంగా రెండు ఆపరేషన్ థియేటర్లు డ్యూటీ మెడికల్ ఆఫీసర్ ప్రత్యేకంగా రూము. ఆపరేషన్ థియేటర్ సంబంధించి ప్రత్యేకంగా శాస్త్ర చికిత్సలు వినియోగించేబిన్ను అంటే ఆపరేషన్ సంబంధించిన పరికరాలను స్పెల్లింగ్ చేయడం. ప్రత్యేక యూనిట్ కి. సపరేట్ మెడికల్ ఆఫీసర్ కి సంబంధించిన రూము. ఆపరేషన్ కి సంబంధించిన మెడిసిన్.పరికరాలు ఒక యూడిసి స్టాఫ్ నర్స్ సిస్టర్లు ఇద్దరు వార్డుబయలు. అలాగే ఆపరేషన్‌కు వచ్చే ఆడవారికి మగవారికి ఆపరేషన్ ముందు.వైద్య పరీక్షలు చేసుకోవడానికి సపరేటు ల్యాబ్. టెక్నీషియన్. ఆసుపత్రిలో ఫ్యామిలీ ప్లానింగ్ సస్త్ర చికిత్సలు చేయించుకునే వారికిసపరేటు అంబులెన్స్ సౌకర్యం మెడికల్ ఆఫీసర్‌కి చుట్టుపక్కల. మండల గ్రామాలలో. పి ఎస్ సి ల పరిధిలోని క్యాంపులలో పాల్గొనడానికి ప్రత్యేక వాహనము. అలాగే ఆపరేషన్ లో పాల్గొనే వైద్య బృందానికి ప్రత్యేకమైన గదులు. హాస్పిటల్ కి వచ్చి ఆపరేషన్ చేయించుకునే వారికి. ఆపరేషన్ అయిన తర్వాత ప్రత్యేకమైన వార్డులు ఉండేవి అన్ని సదుపాయలతో కూడిన ఆసుపత్రి ప్రాంగణంలో ప్రత్యేకమైన వార్డు అలాగే ప్రతి వారంలో మంగళవారం శుక్రవారం ప్రత్యేకంగా మగవారికి ఆడవారికి ఫ్యామిలీ ప్లానింగ్ శస్త్రచికిత్స చేయడం జరుగుతుండేవి వాటితో పాటు పాటు చుట్టుపక్కల గ్రామాలకు ప్రత్యేకంగా క్యాంపులు నిర్వహిస్తూ ఉండేది . ఒకవేళ అనుకోకుండా వ్యాధి నిరోధక టీకాలు వేచి సమయంలో పిల్లలకి ఏమైనా అత్యవసరంగా వైద్యం అవసరం పడితే ఉండడానికి ప్రత్యేకంగా వార్డులు రూములు ఉండేవి. అటువంటిది ఏమీ జరిగిందో ఏమో తెలియదు కానీ. వైద్యంలో ఇందులో రెండు డిపార్ట్మెంట్లు ఉంటాయి. అందులో ఒకటి. DMHO. ఒకటి. DCH.S. ఉంటాయి ఈ రెండు విభాగాలు సిరిసిల్ల ప్రాంతీయ వైద్యశాలలో ఉండేవి దేనికి అది సపరేట్గా ఉండేవి. మధ్యలో ఎంతోమంది సూపర్డెంట్ లో వచ్చారు పోయారు కానీ. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక. అందులో మన ఎమ్మెల్యే మంత్రిగా పదవి బాధ్యత చేపట్టినాక సిరిసిల్ల ప్రభుత్వ వైద్యశాలకు ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పదంలో ముందు ఉంచారు అందులో ఏమి జరిగిందో ఏమో కానీ. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు సిరిసిల్ల ప్రాంతీయ వైద్యశాల కు. సూపర్డెంట్ గా ఒక ఆయన ఉండేవారు. అన్ని ఆయన ఇష్టానుసారంగా మార్చి బడ్జెట్ ను. తన. అనుకూలంగా తను చెప్పిందే వేధంగా కొన్ని. వార్డులను కిందివి మీదికి మీది కిందికి. ఆయన ఉన్న సమయంలో ఆసుపత్రిలో అభివృద్ధి పేరుతో ఎప్పుడు మరమ్మతులు చేస్తూ ఉండేవారు. అందులో భాగంగా. ఆసుపత్రి ఆవరణలో జనరిక్ మెడిసిన్. అనే మెడికల్ షాప్ ఉండేది దానిని తీసుకువెళ్లి. అసలే ఎమర్జెన్సీ ముందర 108 వాహనాలు ఎమర్జెన్సీ వాహనాలు తిరగడానికి స్థలము లేకపోవడంతో ఇబ్బందులు పడుతుండగా దాన్ని తీసుకువెళ్లి ఎమర్జెన్సీ ముందర తను అనుకున్నదే సుప్రీం అన్నట్టుగా తీసుకువెళ్లి ఆసుపత్రికి కాంపౌండ్ కి అనుకుని పైకి నిర్మించారు అప్పుడు ఆసుపత్రికి వెళ్లేవారు పైకి ఎక్కడానికి వీలు లేకుండా అసలు ఆసుపత్రి ఆవరణలో మెడికల్ షాప్ లేదన్న విధంగా ఎవరికి గుర్తు లేకుండా ఉండిపోయింది. అది ఇప్పుడు ఎక్కడ ఉందో కూడా తెలియదు. అలాగే.వ్యాధి నిరోధక. టీకాలు వేసే వారు.అనగా ఒక ప్రత్యేకo గా.ఆసుపత్రి లో డాక్టర్ తో పాటు పిపి యూనిట్ కి ప్రత్యేకంగా సిబ్బంది. ఉండేది ఫ్యామిలీ ప్లానింగ్ సెంటర్ ను. ఆసుపత్రిలోని ఆవరణలో బయట. తీసివేసి బయటకు పంపించి తను ఇష్టానుసారంగా వ్యవహరించారుఆసుపత్రికి వచ్చే రోగులతో సహాయoగ. వచ్చే వారికోసం ప్రత్యేకంగా వంట భోజనం సాల విశ్రాంతి తీసుకోవడానికి ప్రత్యేక హాలును ఏర్పాటు చేశారు అందులోకి ఆసుపత్రిని అంటే వ్యాధి నిరోధక టీకాలు వేసే సిబ్బందిని వాటికి సంబంధించి ఇన్స్ట్రుమెంట్స్ ని. ఫ్రిడ్జ్‌లను వ్యాక్సిన్ లను. భద్ర.పరిచేందుకు ప్రత్యేకంగా ప్రభుత్వం. కొన్ని పరికరాలను పెద్దపెద్ద ఫ్రిడ్జ్‌లను ఫ్యామిలీ ప్లానింగ్ సెంటర్ కి అందజేశారు. దానిని బయటకు పంపించి వేసినారు అప్పటినుండి సిబ్బందికి గాని ఆసుపత్రికి వచ్చే చిన్నపిల్లలకు. గానిఅందులో భాగంగా. ఫ్యామిలీ ప్లానింగ్ సెంటర్ కు వచ్చే వారికి. సౌకర్యాలు లేక ఎండలో బిక్కుబిక్కుమంటున్నారు. ఎప్పుడో ఒకప్పుడు టెంట్లు వేయించి అప్పటికప్పుడు విలదీస్తున్నారు ఆసుపత్రికి వచ్చే వారికి పెర్మనెంట్ సొల్యూషన్ లేక ఆసుపత్రికి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు రావడానికి కూడా వెనకాడుతున్నారు పిల్లలకు వ్యాక్సిన్లు వేయిచ్చుకోవడానికి కనీసం కూర్చోవడానికి కూడా అందుబాటులో కుర్చీలు నీడ కూడా లేదని నామమాత్రంగా ఏర్పాటు చేయడంతో వేచి ఉండడానికి సరైన సౌకర్యాలు లేకపోవడంతో మండుటలలో వ్యాక్సిన్లు వేసుకోవడానికి పిల్లలతో ఎండలో నిరీక్షించడం మాకు పెద్దలకు అలాగే పిల్లలకు ఇబ్బందికరంగా ఉందని. ఏదైనా అనుకోండి సంఘటన జరిగితే ఎవరు బాధ్యులని. దీనిపై వెంటనే సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని. అలాగే ఫ్యామిలీ ప్లానింగ్ సెంటర్ ను. ప్రత్యేకంగా ఆసుపత్రికి. ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకునే వారు రావడం చాలా తగ్గిందని రావడానికి కూడా సౌకర్యాలు అందుబాటులో లేకుండా. ఆసుపత్రికి వచ్చే వారికి కనీసం కూర్చోవడానికి కూడా నిల్వ నీడ లేకుండా పోయిందని. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకొని సంబంధిత మంత్రి దృష్టి తీసుకెళ్లి పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేసే వాటిని ప్రత్యేకంగా ఆ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక గదులు వారికి సామాగ్రి. పెట్టుకోవడానికి పిల్లలు కూర్చోవడానికి. మునుపటి మాదిరిగా ప్రత్యేకంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ జరిగే విధంగా. ప్రత్యేక చొరవ తీసుకోవాలని. ఇప్పటికైనా ఆసుపత్రికి వచ్చే చిన్న పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఒకప్పటి లాగా ఫ్యామిలీ ప్లానింగ్ సెంటర్ మరియు పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు ఇచ్చే వాటిని వాటికి ప్రత్యేకమైన వార్డులు ఏర్పరిచాలని ప్రజలు కోరుతున్నారు. ఒకప్పుడు ఆసుపత్రి వెనకాల చిన్నపిల్లలకు న్యూ బన్స్ పుట్టిన పిల్లలకు ప్రత్యేకమైన అన్ని సౌకర్యాలతో సదుపాయాలతో ప్రత్యేకమైన వార్డు గదులు ఏర్పాటు చేసి అందులో ఎయిర్.కండిషన్ కూడా పెట్టించారని అటువంటిది ఇప్పుడు ఆసుపత్రి అది. కనీసం రోగులకు ఉపయోగపడకుండా. ల్యాబ్ అనగా వైద్య పరీక్షలకు ఉపయోగిస్తున్నారని. వాటినైనా సపరేట్ ఫ్యామిలీ ప్లానింగ్ సెంటర్ కు కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ. దీనిపై జిల్లా వైద్య అధికారిని వివరణ అడగగా చిన్న పిల్లలకు వ్యాధినిరోక టీకాలు వేయించుకుంటున్న పిల్లలకు తల్లిదండ్రులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని దీనిపై ఆసుపత్రి సూపర్డెంట్ తో మాట్లాడి ప్రత్యాత్మకంగా ఏర్పాట్లు చేయి స్తామనిఆసుపత్రి వచ్చే వారికి పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా.DMHO. జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత. మేడం గారుఏర్పాట్లు చేస్తామని తెలియజేశారు ఏది ఏమైనా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా తనిఖీ చేసి అది ఎలా ఉపయో కరంగా పనిచేస్తుందని. ఆరా తీస్తూ ఆ డిపార్ట్మెంట్ వాటికి ప్రత్యేకంగా వార్డు గదులు కేటాయించాలని. మునుపటి మాదిరిగా ప్రత్యేకంగా. పి.పి. యూనిట్ వినియోగించుకోవాలని ఆసుపత్రికి వచ్చే చిన్న పిల్లలు తల్లిదండ్రులు ప్రజలు కోరుచున్నారు. దీనిపై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగ్రవాల్ ప్రత్యేక చొరవ. తీసుకొని చిన్న పిల్లలకు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకొనే విధంగా చొరవ చూపాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు.
