వేములవాడ, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి చిన్నారి శరణ్య మూడవ తరగతి చదువుతున్న నిరుపేద కుటుంబానికి వేములవాడ పట్టణానికి చెందిన ఆది యువసేన నాయకుడు దో0తుల మణికంఠ ఆ కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది మరియు వేములవాడ పట్టణానికి చెందిన నిరుపేద కుటుంబం భూదేవి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది ఎంతో గొప్ప మనసుతో సాయం చేసినటువంటి దో0తుల మణికంఠ ను పలువురు అభినందించడం జరిగింది. మణికంఠ హైదరాబాదులో స్థిరపడ్డప్పటికీ వేములవాడలో ఉన్నటువంటి వాళ్ళ మిత్రులు వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, బీసీ సెల్ టౌన్ ప్రెసిడెంట్ రాము గౌడ్ ద్వారా వారికి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది ఈ సందర్భంగా మణికంఠ మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు అండగా ఆది యువసేన ఉంటుందని వారన్నారు.