Srikanth Assures Development in Janapriya West City
జనప్రియ వెస్ట్ సిటీ కాలనీలో సమస్యల పరిష్కారానికి కృషి: మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-
మియాపూర్ డివిజన్ పరిధిలోని జనప్రియ వెస్ట్ సిటీ కాలనీలో గల పలు సమస్యలు, చేపట్టవలసిన అభివృద్ధి పనులపై మియాపూర్ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ శ్రీ ఉప్పలపాటి శ్రీకాంత్ కాలనీవాసులతో కలసి శనివారం పాదయాత్ర నిర్వహించారు. కాలనీలో స్వయంగా పర్యటించిన ఆయన స్థానిక సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ.. కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు ఈ రోజు పాదయాత్ర చేసి ఇక్కడి సమస్యలను స్వయంగా తెలుసుకోవడం జరిగిందన్నారు. చిన్న చిన్న సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించినట్లు తెలిపారు. జనప్రియ వెస్ట్ సిటీ కాలనీలో మౌలిక వసతుల కల్పనే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. కాలనీ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే కాలనీలోని పార్కు, కమ్యూనిటీ హాల్ సమస్యలను కూడా పరిశీలించామని, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని తెలియజేశారు. గౌరవ పీఏసీ ఛైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారి సహకారంతో డివిజన్ పరిధిలో మంజూరైన అభివృద్ధి పనులను విడతలవారీగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని శ్రీకాంత్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జనప్రియ వెస్ట్ సిటీ కాలనీ అధ్యక్షులు సందీప్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు గోవర్ధన్, రామలింగం గౌడ్, ఏయస్ఎన్ మూర్తి, మహేష్ కుమార్, శ్రీనివాస్ రావు, ప్రసాద్, హరికృష్ణ, వి.ఆర్. శర్మ, శ్రీనివాస్, ఈశ్వర్ రెడ్డి, నరసింహులు, సుధాకర్, శంకర్ రావు, బ్రహ్మచారి, అనిల్ కుమార్, బాలాజీ సింగ్ మరియు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
