CI Naresh Kumar Goud Offers Special Prayers at Kotagullu
కోటగుళ్ళ లో భూపాలపల్లి సిఐ దొమ్మాటి నరేష్ కుమార్ గౌడ్ పూజలు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలోప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో శనివారం అమావాస్య పర్వదిన సందర్భంగా భూపాలపల్లి సిఐ దొమ్మాటి నరేష్ కుమార్ గౌడ్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం కోటగుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు.
