తిమ్మంపేటలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
త్వరగా ధాన్యం తరలించాలని మిల్లర్లకు విజ్ఞప్తి
దుగ్గొండి, నేటిధాత్రి:
దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.సొసైటీ చైర్మన్ సుకినే రాజేశ్వరావు మాట్లాడుతూ ధాన్యాన్ని తూకం వేసిన వెంటనే త్వరితగతిన ట్రాన్స్పోర్ట్ చేసి రైస్ మిల్లర్లు వెంటనే దిగుమతి చేయాలని కోరారు. వర్షం వచ్చే అవకాశం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారని, వెంటనే ధాన్యాన్ని తరలించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మోడం శ్రీలత మల్లేష్, డైరెక్టర్లు సూరారెడ్డి, అజ్మీర సాంబయ్య, మోకిడే ప్రభాకర్, గోసంగి పురుషోత్తం, సీఈఓ దామోదర్ రెడ్డి, ఇన్ఛార్జి మధ్య సుధాకర్, రంగయ్య, సాంబరాజు, రైతులు పాల్గొన్నారు.
