2 నుంచి జర్నలిస్టుల క్రీడాపోటీలు

2నుంచి జర్నలిస్టుల క్రీడాపోటీలు

వరంగల్‌ ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో మే నెల 2 నుంచి 20వ తేదీ వరకు జర్నలిస్టులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని, జర్నలిస్టుల మానసిక ప్రశాంతత కోసం ఈ క్రీడలు నిర్వహిస్తున్నామని హన్మకొండ ప్రెస్‌క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు తుమ్మ శ్రీధర్‌రెడ్డి, పెరుమాండ్ల వెంకట్‌ తెలిపారు. గురువారం హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రికెట్‌, వాలీబాల్‌, షటిల్‌, బ్యాడ్మింటన్‌, క్యారమ్స్‌, చెస్‌ క్రీడాంశాలలో పోటీలు నిర్వహిస్తున్నామని వారు సంయుక్తంగా వెల్లడించారు. ఆసక్తి గల జర్నలిస్టులు ఈనెల 30వ తేదీ లోపు ఆయా క్రీడల టీముల వివరాలను ప్రెస్‌క్లబ్‌లో నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ పోటీలలో పాల్గొనే జర్నలిస్ట్‌ క్రీడాకారులు ప్రెస్‌క్లబ్‌ సభ్యులు మాత్రమే అయి ఉండాలని వెల్లడించారు. ఈ సమావేశంలో ప్రెస్‌క్లబ్‌ కోశాధికారి బొమ్మినేని సునీల్‌రెడ్డి, స్పోర్ట్స్‌ కమిటీ కన్వీనర్‌ అర్షం సదానందం, ప్రెస్‌ క్లబ్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *