(డిసెంబర్ 25)
మాజీ ప్రధాని, భారతరత్న, పద్మవిభూషణ్, ఉత్తమ పార్లమెంటేరియన్, నవ భారత నిర్మాత, వ్యాఖ్యాత, సుకవి, రచయిత, పార్టీలకు అతీతంగా భారతీయుల మనసులు గెలిచిన నేత అటల్ బిహారీ వాజ్‌పేయి గారు
ఆధునిక భారత నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించిన మహనీయులలో ముఖ్యులు శ్రీ అటల్ బిహారీ వాజపేయి గారు. ప్రధానిగా అత్యుత్తమ విధానాలతో దేశ గమనాన్ని మార్చిన నేత వాజపేయి
దేశంలోని అభివృద్ధి చెందిన రోడ్లలో సగం వాజపేయి పాలనలో అభివృద్ధి చేసినవే. ఆ సమయంలోనే జరిగిన పోఖ్రాన్ అణు పరీక్షలు, కార్గిల్ విజయం వంటివి భారత దేశ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ తప్పక తలచుకోవాల్సిన దేశభక్తుడు శ్రీ వాజపేయి గారు.
మనం నిర్లక్ష్యం చేసిన చిన్న చిన్న తప్పులే భవిష్యత్తులో రెట్టింపు శక్తితో పగ తీర్చుకుంటాయని ఒక మహానుభావుడు చెప్పాడు… అద్వానీ గారిని చూస్తే ఈ విషయం నిజమే అనిపిస్తుంది… 2002 లో గోద్రా అల్లర్లు జరిగినపుడు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ని పదవిలో నుండి తప్పించాలని ఆనాటి ప్రధాని అటల్ బిహారి వాజపేయి గారు నిర్ణయం తీసుకుంటే అడ్డుకున్న వ్యక్తి అద్వానీ గారు మరియు వెంకయ్య నాయుడు గారు… కానీ ఈ రోజు వాస్తవంగా జరుగుతున్నదేంటి… నాడు ఎవరైతే మోడీ గారికి మద్దతుగా నిలిచి ఈ రోజు ప్రధానిగా ఎదగడానికి సహాయ పడ్డారో వారినే ఈ రోజు వ్యూహాత్మకంగా పక్కకు పెట్టి భవిష్యత్తులో మోడీకి ఎలాంటి సమస్య రాకుండా చేసుకుంటున్నారు… ఏదేమైనా రాజకీయాల్లో విశ్వసనీయత, విధేయత లాంటి పదాలకు స్థానం ఉండదని మరో సారి నిరూపితం అయింది..
నవ భారత నిర్మాణానికి బాటలు వేసి, పార్టీలకు అతీతంగా భారతీయుల మనసులు గెలిచిన అత్యుత్తమ ప్రధానమంత్రి
అటల్ బిహారి వాజపేయి , 1924 డిసెంబర్ 25 న మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో జన్మించారు
తల్లి కృష్ణ దేవి , తండ్రి కృష్ణ బిహారి వాజపేయి , విద్యాబ్యాసం అంత గ్వాలియర్ లోనే కొనసాగింది , గ్వాలియర్లోని విక్టోరియా కాలిజి నుంచి హిందీ లో డిగ్రీ పూర్తి చేసారు ,ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ డిఎవి కాలేజీ నుంచి రాజనీతి శాస్త్రం లో మాస్టర్స్ పట్టా పొందారు
1957 లో మొదటి సారి లోక్ సభ కి ఎన్నిక అయ్యారు , తన జీవితం లో మొత్తం 10 సార్లు లోక్ సభ కి 2 సార్లు రాజ్య సభ కి ప్రాతినిధ్యం వహించారు
మొదటిసారి లోక్ సభ కి ఎన్నిక అయినప్పుడే పండిట్ నెహ్రు ద్రుష్టి లో పడ్డారు , ఈ యువకుడు ఎప్పటికైనా భారత ప్రధాని అవుతాడు అని నెహ్రు పలికినా పలుకులు నిజం చేస్తూ మొట్టమొదటి సారి 1996 లో కేవలం 13 రోజులు భారత ప్రధానిగా పని చేసారు ,
1998 లో రెండు దఫా పదమూడు నెలలు పనిచేసారు , అప్పట్లో ప్రతి పక్షాలు అవిశ్వాస తీర్మానం ఒక్క ఓటు తో గెలవటం తో పదవి కోల్పోయారు,
తరవాత 1999 ముచ్చటగా 3 పర్యాయం ప్రధాని పీఠం చెప్పటి పూర్తి కాలం పదవి లో కొనసాగారు ,
ప్రధాని గా పూర్తి టర్మ్ పూర్తి చేసిన మొదటి నాన్ కాంగ్రెస్ ప్రధాని గా, నిలిచిపోయారు
1977 లో మురార్జీ దేశాయి మంత్రి వర్గం లో విదేశాంగ శాఖ మంత్రి గా పనిచేసారు , 1991 -96 లో లోక్ సభ లో ప్రతిపక్ష నాయకుడు గా వున్నారు ,
1993 లో ప్రవేశ పెట్టిన ఉత్తమ పార్లమెంటేరియన్ మొదటి అవార్డు , నాటి ప్రధాని పివి నరసింహా రావు చేతుల మీదగా అందుకున్నారు ,
భారత ప్రభుత్వం 1992 లో పద్మ విభూషణ్ , అవార్డు 2014 లో భారత రత్న అవార్డు తో వాజపేయి ని గౌరవించింది రెండో సారి ప్రధాని అయినా వెంటనే పోక్రాన్ లో అణుపరీక్షలు జరిపి , భారత దేశ సత్తా ప్రపంచానికి చాటారు
వాజపేయి హుయాంలోనే ఢిల్లీ – లాహోర్ బస్సు ప్రారంభించారు ,
వాజపేయి ప్రధాని గా వున్నా కాలం లోనే నవాజ్ షరీఫ్ , ముషారఫ్ భారత దేశం సందర్శించారు
పాకిస్తాన్ తో కార్గిల్ యూద్దాం చేసి విజయం సాధించారు
ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన అనే పధకం తో గ్రామీణ రహదారుల కి వాజపేయి కాలం లో మహర్దశ పట్టింది , చాల గ్రామాలూ కి ఈ పధకం ద్వారా తారు రోడ్లు వేశారు ,ప్రధాన మంత్రి స్వర్ణ చతుర్భుజి పధకం ద్వారా దేశం లో మెట్రో నగరాలూ అయినా
ఢిల్లీ -ముంబై -చెన్నై -కలకత్తా లను కలుపుతూ 4 వరసలు జాతీయ రహదారుల నిర్మాణం
పోర్బందర్ -సీలాచార్ తూర్పు పశ్చిమ క్యారిడారు
కాశ్మీర్ -కన్యాకుమారి ఉత్తర -దక్షిణ క్యారిడార్
నిర్మాణాలు వాజపేయి ప్రధాని గా వున్నా సమయం లోనే ప్రారంభం అయినాయి.
మాజీ ప్రధాని , కవిగా కూడా పేరొందిన అటల్ బిహారీ వాజ్‌పేయి జీవితం ఆధారంగా సినిమా రాబోతోంది. బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠీ ఈ బయోపిక్‌లో వాజ్‌పేయి పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాకు ‘మై రహూ యా నా రహూ, యే దేశ్ రెహ్నా ఛాయియే అటల్ అనే పేరు పెట్టారు. ఈ సినిమాకు రవి జాదవ్ దర్శకత్వం వహించారు.
కార్గిల్ యుద్ధ సమయంలో
బిల్ క్లింటన్ గారు మీరు దాడులు తీవ్రతరం చేస్తే పాకిస్థాన్ మీ మీద అణుబాంబు వేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అని అనడంతో ఒక వేళ అదే జరిగితే రేపటి సూర్యోదయానికి పాకిస్థాన్ ఆచూకీ కూడా మీకు తెలియదు అని వాజ్ పెయి గారు బదులిచ్చారు.
కార్గిల్ యుద్ధం, భారత్ పాకిస్తాన్ మధ్య మే – జూలై 1999 లో కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలోను, మరికొన్ని సరిహద్దుల వద్దనూ జరిగింది. ఈ యుద్ధానికి కారణం పాకిస్తాన్ సైనికులు, కాశ్మీరీ తీవ్రవాదులు నియంత్రణ రేఖ (ఎల్.ఒ.సి) దాటి భారతదేశంలోకి చొరబడడం. యుద్ధప్రారంభ దశలో పాకిస్తాన్ ఇది కాశ్మీరీ తిరుగుబాటుదారులు చేస్తున్న యుద్ధంగా పేర్కొన్నప్పటికీ యుద్ధంలో మరణించిన వారి దగ్గర లభించిన ఆధారాలను బట్టి, తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి పాకిస్తాన్ సైన్యాధిపతులు చేసిన వ్యాఖ్యలను బట్టీ ఇందులో పాకిస్తాన్ సైనిక దళాల హస్తం కూడా ఉందని రుజువయ్యింది.అధీనరేఖ దాటి పాకిస్తాన్ ఆక్రమించుకున్న ప్రదేశాలను భారత సైన్యం, భారత వాయుసేన సహకారంతో తిరిగి స్వాధీనపరుచుకుంది. అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక పాకిస్తాన్ సైన్యం వెనుతిరిగింది. ఎత్తైన పర్వత ప్రాంతాల మీద జరిగిన యుద్ధాల కిది తాజా ఉదాహరణ. ఇంత ఎత్తులో యుద్ధం జరగడం వల్ల ఇరు పక్షాలకూ ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అణుబాంబులు కలిగియున్న దేశాల మధ్య జరిగిన యుద్ధాలలో ఇది రెండోది (మొదటిది చైనా – సోవియట్ ల మధ్య 1969 లో జరిగింది).
భారత దేశ ప్రధానులలో ఒక ఉత్తమ ప్రధాని గా చరిత్ర లో నిలిచిపోయిన భారత రత్న అటల్ బిహారి వాజపేయి గారు మనకి ఎప్పటికి ఆదర్శనీయుడు..
– ఆలేటి రమేష్
9948798982.