Assured Irrigation for Farmers
ప్రతి రైతుకు సాగునీటి అందిస్తాం డిఈ తిరుపతి
పెదముడిసిలేరు సర్పంచ్ సుహాసిని
నేటిదాత్రి చర్ల
తాలిపేరు డ్యామ్ వద్ద ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక రైతు వారంలో భాగంగా సమర్థ నీటి పారుదల కొరకు గేట్ల నిర్వహణ అంశంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో డీఈ తిరుపతి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మంజూరైన పనుల వివరాలు ప్రస్తుతం కొనసాగుతున్న పనుల పురోగతిపై రైతులకు అవగాహన కల్పించారు అలాగే డ్యామ్ గేట్ల మరమ్మతులు పెయింటింగ్ పనుల ప్రాముఖ్యతను వివరించారు పెద్దమిడిసిలేరు సర్పంచ్ సుహాసిని మాట్లాడుతూ తాలిపేరు డ్యామ్ వద్ద పర్యాటక రంగ అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు అదేవిధంగా ఇటువంటి సమావేశాల ద్వారా రైతులు మరియు అధికారుల మధ్య పరస్పర చర్చలు జరగడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు
గ్రామ పెద్ద శ్యామల రామారావు మాట్లాడుతూ రైతులు కాలువలను ఆక్రమించకుండా బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు చిన్న చిన్న రైతు సమస్యలను ఇరిగేషన్ శాఖ సహకారంతో పరిష్కరించుకొని సాగునీటికి ఎటువంటి ఆటంకం లేకుండా చూసుకోవాలని రైతులకు సందేశం ఇచ్చారు
ఈ కార్యక్రమంలో సహాయక కార్యనిర్వాహక ఇంజినీర్ సంపత్ సహాయక ఇంజినీర్ సుమన పెద్దమిడిసిలేరు కార్యదర్శి ప్రశాంతి పాల్గొన్నారు
