చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం
90 శాతం మంది రైతులకు రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుంది
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
గంగాధర నేటిధాత్రి:
ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకువచ్చిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు ఇస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. గంగాధర మండలంలోని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యం. ఎమ్మెల్యే మాట్లాడుతూ యేసంగి సీజన్ లో రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోకుండా ముందస్తుగానే ప్రణాళిక చేసి సాగు నీటిని విడుదల చేసి గుంట భూమి కూడా ఎండిపోకుండా సాగునీరు అందించాము. తెలంగాణ రాష్ట్రంలోని 90 శాతం మంది రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో సన్న వడ్లకు రూ.500 చెల్లిస్తున్నాము.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ యేసంగి సీజన్లో భూమికి బరువైనన్ని వడ్లు వచ్చాయి.
ఎన్నడూ లేని విధంగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వెలువెత్తుందని, ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలి. ప్రతిపక్షాల మాటలు నమ్మి రైతులు ఆందోళనకు గురి కావొద్దు, కొనుగోలు కేంద్రాలకు రైతును తీసుకువచ్చిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాము. ఈ కార్యక్రమంలో గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్ రావు, సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, దుబ్బాసి బుచ్చయ్య,రామిడి రాజిరెడ్డి,సత్తు కనుకయ్య ,గుజ్జుల బాపురెడ్డి, గడ్డం అంజయ్య, రోమల రమేష్, దోమకొండ మహేష్, దోర్నాల శ్రీనివాసరెడ్డి,రాజ గోపాల్ రెడ్డి ,కర్ర బాపు రెడ్డి, తోట సంధ్య ,రెండ్ల శ్రీనివాస్, తిరుపతి,తదితరులు పాల్గొన్నారు.