‘‘కేసిఆర్’’ నాయకత్వం వరం..తెలంగాణ అయ్యింది బంగారం: రాజ్యసభ సభ్యుడు ‘‘వద్దిరాజు రవిచంద్ర’’.
బీఆర్‌ఎస్’’ రజతోత్సవాలు తెలంగాణ ప్రజల పండుగ.
‘‘కేసిఆర్’’ లాంటి నాయకులు యుగానికొక్కరు మాత్రమే వుంటారంటున్న రాజ్యసభ సభ్యుడు, ‘‘బిఆర్‌ఎస్’’ సీనియర్ నాయకుడు ‘‘వద్దిరాజు రవిచంద్ర’’, నేటిధాత్రి ఎడిటర్ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో
‘‘బిఆర్‌ఎస్’’ రజతోత్సవ వేడుకలు,
‘‘కేసిఆర్’’ ఘనకీర్తిపై ముచ్చటించిన అంశాలు ఆయన మాటల్లోనే…
`తెలంగాణ కోసం జన్మించిన ‘‘కారణ జన్ముడు కేసిఆర్’’
`పట్టు వదలని విక్రమార్కుడు’’గా తెలంగాణ సాధించిన వీరుడు ‘‘కేసిఆర్’’
`తెలంగాణ కర్త, కర్మ, క్రియ ‘‘కేసిఆర్’’
`తెలంగాణ ఆత్మ గౌరవం నిలిపిన నాయకుడు ‘‘కేసిఆర్’’
`ఉద్యమాన్ని, రాజకీయాన్ని రంగరించి తెలంగాణ సాధించిన ‘‘అపర చాణక్యుడు కేసిఆర్’’
`రాజకీయంగా అస్తిత్వాన్ని చూపించి తెలంగాణ తెచ్చిన నేత ‘‘కేసిఆర్’’
`ప్రపంచ చరిత్రలోనే అరుదైన ఉద్యమ రాజకీయానికి శ్రీకారం చుట్టిన నాయకుడు ‘‘కేసిఆర్’’
`‘‘కేసిఆర్’’ లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదు
`‘‘కేసిఆర్’’ ను కాదని తెలంగాణను చూడడం చరిత్రకే సాధ్యం కాదు
`తెలంగాణ రాష్ట్ర సిద్ది కోసం పడిన పరిశ్రమ ‘‘కేసిఆర్’’
`తెలంగాణ తేవడమే జీవిత లక్ష్యంగా రాజకీయం నడిపిన నాయకుడు ‘‘కేసిఆర్’’
`‘‘బిఆర్‌ఎస్’’ ‘‘రజతోత్సవ’’ సభతో కాంగ్రెస్ గుండెలు అదిరిపోతాయి
`మరో 25 సంవత్సరాల వరకు ‘‘బిఆర్‌ఎస్’’ అధికారంలో వుండేందుకు పునాదులు పడతాయి
`ఇక తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను ఎప్పుడూ నమ్మరు
`సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో తెలంగాణను బంగారం చేసిన ఘనత ‘‘కేసిఆర్’’ది
`తెలంగాణ తెచ్చి, బంగారు తెలంగాణ చేసిన నాయకుడు ‘‘కేసిఆర్’’
`‘కేసిఆర్’’ లాంటి నాయకుడు ప్రపంచ చరిత్రలోనే మరొకరు కనిపించరు
హైదరాబాద్,నేటిధాత్రి:
నా పల్లెలో నీరెందుకు లేదు? నా ఊరుకు నీళ్లెందుకు రావు? నా చెరువులు ఎందుకు ఎండిపోతున్నాయి? చెరువులెందుకు ఒట్టిపోతున్నాయి? నా తెలంగాణ ఎందుకు పచ్చబడదు? నా తెలంగాణలో నీళ్లెందుకు పరవళ్లు తొక్కవు? పంటపొలాల నిండా నీళ్లెందుకు వుండవు? బావుల్లో ఊటమెందుకు మాయమైపోతున్నాయి? చేదబావుల్లో నీళ్లెందుకు అడుగంటుతున్నాయి? చుక్క నీరు కూడా లేక జనం గొంతు ఎండుతోంది? ఎవరి లోపం? ఎందుకు ప్రశ్నించలేకోతున్నాం? ఎందుకు నిలదీయలేకపోతున్నాం? ఎందుకు తెలంగాణకు నీళ్లు తెచ్చుకోలేకపోతున్నాం? అటు ఫ్లోరైడ్ పీడన, ఇటు సాగుకు రైతు వేధన ఎంత కాలం? ఎన్నెళ్లు ఈ ఆరాటం? ఊళ్లన్నీ వల్లకాడులౌతున్నాయి? తెలంగాణ పల్లె జనం వలసలు పోయి ఇళ్లన్నీ కూలిపోతున్నాయి. వాకిళ్లు పొక్కిళ్లు తేలి, ఊరు పాడుబడితోంది? నా తెలంగాణకే ఎందుకీ గోస? మా ప్రజలకే ఎందుకీ బాధ? అని ప్రతి క్షణం కన్నీరు పెట్టుకున్న నాయకుడు కేసిఆర్. పల్లె పల్లెనా పల్లేర్లు మొలిచే తెలంగాణలోనా..అంటూ కవులు పాడుతుంటే కన్నీరు మున్నీరైన నేత కేసిఆర్. అందుకే తెలంగాణకు విముక్తి జరిగితే తప్ప మన ప్రాంతం బాగు పడదని బలంగా నమ్మి జై తెలంగాణ నినాదం అందుకున్న గొప్ప దార్శనికుడు కేసిఆర్ అంటున్న రాజ్యసభ సభ్యుడు, బిఆర్‌ఎస్ సీనియర్ నేత వద్ది రాజు రవిచంద్ర నేటిధాత్రి ఎడిటర్ కట్టారాఘవేంద్రరావుతో కేసిఆర్ గురించి పంచుకున్న ముచ్చట్లు ..ఆయన మాటల్లోనే…
బలవంతంగా చేసిన పెళ్లితో సంసారం కల కాలం సాగదు. గతి లేని సంసారమైనా సాగుతుందేమో? కాని శృతిలేని సంసారం సాగదు?ఉ మ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ వచ్చారు. పాలనతో వివక్ష చూపుతూ వచ్చారు. అభివృద్దిలో సవతి తల్లి ప్రేమ చూపారు. తెలంగాణను ఎండబెట్టారు. ఏపిని పండుగ చేసుకున్నారు. ఏపి, తెలంగాణ కలవక ముందు తెలంగాణలో కరవు లేదు. తెలంగాణలో పీడ లేదు. తెలంగాణకు ఆకలి లేదు. కాని ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటు కాగానే శాపం తగిలినట్లు తెలంగాణ వాడిపోయింది? ఎండిపోయింది? నీటికి గోసపడాల్సి వచ్చింది. సాగు పడిపోయింది. రైతుకు దుఖం మిగిలింది. ఇల్లు, ఊరు, భూమిని వదలుకొని తెలంగాణ పల్లె జనం వలసలు పోయే దుస్తితి వచ్చింది. సాగులేదు. కొలువు లేదు. తెలంగాణకు సరిగ్గా సదువులేదు. సౌకర్యాలు లేవు. కరంటు లేదు. ఏదీ లేదు. కాని ఏపిలో అన్ని సమకూరుతున్నాయి. కాలువలు లేని చోట కొత్త కాలువలు పుట్టుకొచ్చాయి. ఒకప్పుడు తెలంగాణకన్నా సాగులో ఏపి వెనుకబడి వుంది. తెలంగాణతో కలవగానే ఏపి అన్న పూర్ణగా మారింది. అయినా తెలంగాణతో జతకట్టి బాగు పడ్డామని ఏపి నాయకులు అనుకోలేదు. తెలంగాణ ప్రాంతాన్ని అభివృ ద్ది చేయాలనుకోలేదు. రెండు ప్రాంతాలు కలిసినప్పుడే తెలంగాణ వద్దని మొత్తుకున్నది. కాని బలవంతంగా కలిసి, తెలంగాణను చిల్లం చిల్లం చేశారు. తెలంగాణను గోస పెట్టారు. ఈ గోసను చిన్న నాటి నుంచి కళ్లారా చూసిన కేసిఆర్‌ను రగిలించింది. తెలంగాణ ఉద్యమ బావుటా ఎగురవేయాలని ఆనాడే కేసిఆర్ మది సంకల్పించింది. సమైక్య వాదులు చేసిన మోసాన్ని, పాపాన్ని కడిగేసే సమయం వచ్చింది. కేసిఆర్ చేతి పిడికిలి బిగించింది. జై తెలంగాణ అని ఎలుగెత్తి చాటింది. దిక్కులు పిక్కటిల్లేలా కేసిఆర్ గొంతు జై తెలంగాణ నినానం చేసింది. అంతే తెలంగాణ మొత్తం గొంతు సవరించుకొని జై తెలంగాణ అని జై కొట్టింది. ఎందుకంటే కేసిఆర్ అనే పదమే ఒక ఉప్పెన. కేసిఆర్ అనే పదమే ఒక విజృంభన. కేసిఆర్ అనే పదమే ఒక ఉద్యమం..ఒక ఆరాటం..ఒక పోరాటం. ఒక ఆలోచనతో కూడిని ఆవేశం. మొత్తంగా కేసిఆర్ పిలుపే ఒక ప్రభంజనం. అందుకే కేసిఆర్ జై తెలంగాణ అన్న వెంటనే తెలంగాణ సమాజం కదలింది. ఉప్పెనై పొంగింది. వరదలా జై తెలంగాణ నినాదం మారు మ్రోగింది. కేసిఆర్ అనే మూడక్షరాల పదంలోనే తెలంగాణ వుంది. తెలంగాణ జీవితం వుంది. తెలంగాణ ఆత్మ వుంది. తెలంగాణ జీవం వుంది. తెలంగాణ జీవితం ప్రజలకు కేసిఆర్‌లో కనిపించింది. కేసిఆర్‌తో కలిసి తెలంగాణ సమాజం నడిచింది. తెలంగాణ కోసం ప్రజ తెగించి కొట్లాడిరది. పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడానికి యుగానిక్కొరే కేసిఆర్ లాంటి యుగ పురుషులు జన్మిస్తారు. ప్రజల కోసం తమ జీవితం కరిగిస్తారు. జనం కోసమే జీవిస్తారు. జనం దుఖమే తమ దుఖమనుకుంటారు. జనం కోసం జీవితాన్ని త్యాగం చేస్తారు. అలాంటి గొప్ప సుగుణాలే కాదు, పోరాట విలువలున్న ఏకైక నాయకుడు కేసిఆర్. జనమే కేసిఆర్, కేసిఆరే జనం అన్నంతగా ప్రజల గుండెల్లో నిండిపోతారు. అలాంటి కారణజన్ముడు తెలంగాణ సాధన కోసం బిఆర్‌ఎస్ పార్టీ పెట్టి 25 సంవత్సరాలు పూర్తవుతుంది. పుబ్బలో పుట్టి మగలో మాయపోతుందని ఎగతాలి చేసిన వాళ్లును తెలంగాణ పొలిమేర దాక తరిమికొట్టిన నాయకుడు కేసిఆర్. తొండలు గుడ్లు కూడా పెట్టవని ఎద్దేవా చేసిన వారి కళ్లు కుల్లుకునేలా తెలంగాణ కోటి ఎకరాల మాగాణ చేశారు. ఒకప్పుడు కోనసీమలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో పది ఎకరాలు కొనొచ్చు అనుకునేవారు. ఇప్పుడు తెలంగాణలో ఒక్క ఎకరం అమ్మితే అదే కోనసీమలో 50 ఎకరాలు కొనొచ్చు అనే స్ధాయికి కేసిఆర్ తెచ్చారు. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చారు. తెలంగాణకు గుక్కెడు మంచి నీళ్లు ఇవ్వడమే కష్టమన్న వారు చూస్తుండగానే ఇంటింటికీ దేశంలోనే ఎవరూ ఇవ్వనటువంటి సురక్షితమైన మంచినీటిని అందించారు. ఆరోగ్య తెలంగాణను కేసిఆర్ ఆవిష్కరించారు. ఎత్తి పోతల తప్ప తెలంగాణకు దిక్కులేదు..అంత శక్తి ప్రభుత్వానికి లేదు…తెలంగాణలో ప్రాజెక్టులు కట్టలేం..ఆ ప్రాంత దౌర్భాగ్యానికి మేమేం చేయలేమని సమైక్య వాదులు ఈసడిరచుకున్నారు. తెలంగాణలో పుట్టడమే మీ ఖర్మ అన్నంతగా నిర్లక్ష్యం చేశారు. ఆ కసి నుంచి పుట్టిన జంరaామారుతమే కేసిఆర్. ఏ నోటితోనైనా తెలంగాణ పచ్చబడడం కల అని అన్నారో వాళ్ల నోటితోనే తెలంగాణ అన్న పూర్ణ అనిపిస్తానని చెప్పి మరీ నీళ్లు తెచ్చిన అపరభగీరధుడు కేసిఆర్. తెలంగాణ తెచ్చాడు. తెచ్చిన తెలంగాణను పదేళ్లలో బంగారు తునక చేశాడు. సహజంగా కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో కుదుటపడడానికే కొంత సమయం పడుతుంది. కాని తెలంగాణ వచ్చిన మూడు నెలల్లోనే తెలంగాణకు వెలుగులు పంచారు. ఆరు నెలల్లో తెలంగాణలో కరంటు కోతలు లేకుండాచేశారు. అసలు ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు కరంటువస్తుందో..ఎప్పుడు పోతుందో.. తెలియని పరిస్దితి నుంచి తెలంగాణలో చీకట్లను తరిమేసిన నాయకుడు కేసిఆర్. తెలంగాణ రాత్రిళ్లు కూడా పగలును మరిపించేలా వెలుగులు విరజిమ్ముతుంటే, ఏపిలో కరంటు కోతలతో అల్లాడిరది. తెలంగాణ వస్తే కరంటు వుండదు..అంధకారమౌతుందని చెప్పిన వాళ్ల కళ్లు తెరిపించేలా కరంటువెలుగులు నింపారు. మరో వైపు రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరంటు ఇచ్చారు. ఏడాది లోపే మిషన్ కాకతీయ జలయజ్ఞం మొదలుపెట్టారు. చెదిరిపోయి, పూడిపోయి, ఆనవాలులేకుండా పోయిన చెరువులను బాగు చేశారు. తెలంగాణలో వున్న 46వేలకు పైగా చెరువులను మూడు దఫాలుగా మూడేళ్లలో రూపు రేఖలు మార్చారు. ఎండా కాలంలో కూడా చెరువులు మత్తళ్లు పోయించారు. ఎప్పుడో ముప్పై నలభై ఏళ్ల క్రితమే ఎండిపోయిన బావులు నీళ్లు ఎల్లబోశాయి. బోర్లు వేసి, వేసి అలసిపోయిన రైతులకు పాత బావులు నిండి పొలాలు పారాయి. తమ జీవిత కాలంలో కూడా అచ్చు కట్టని భూములను కూడా రైతులు సాగుకు సన్నద్దంచేశారు. చెను, చెలకల్లో కూడా వరి పండిరచి, గుంట స్ధలం కూడా వదిలిపెట్టకుండా రైతులు పొలాలుగా మార్చుకున్నారు. ఇరవై నాలుగు గంటల కరంటు వస్తుండడంతో వలసలు పోయి తెలంగాణ ప్రజలు మళ్లీ పల్టెబాట పట్టారు. చెదిరిపోయిన ఇళ్లను బాగు చేసుకొని, పల్లెల్లో బంగారం పండిస్తున్నారు. సాగుతోపాటు, పాడిని పెంచుకుంటూ, ఇతర వ్యాపారాలు చేసుకుంటూ రైతు కూడా రకరకాల ఆదాయ మార్గాలను ఎంచుకునేలా చేశాడు. ఇరవై నాలుగు గంటల కరంటుతో అనేక ఉపాది అవకాశాలు పెరిగాయి. ఒకప్పుడు జిరాక్స్ కావాలంటే కూడా రోజులో కరంటు ఎప్పుడొస్తుందా? అని గంటల తరబడి పడిగాపులు కాసిన వాళ్లే, ఇప్పుడు సాగుతోపాటు జిరాక్స్ మిషన్లు తెచ్చి అదనపు ఆదాయం సంపాదించుకుంటున్నారు. తెలంగాణ పల్లెలను ఆదాయసృష్టి వనరులుగా మార్చారు. ఇవన్నీ మన కళ్ల ముందు కనిపిస్తున్న నిజాలు. అందుకే కేసిఆర్ తెలంగాణప్రజల దేవుడు. ఊరును మట్టిదిబ్బ, పొలాన్ని ఎడారి చేసిన సమైక్య వాదుల కంబంధ హస్తాల నుంచి తెలంగాణను రక్షించి, తెలంగాణ తెచ్చి పల్లెను పాలవెల్లిని చేసిన గొప్ప నాయకుడు కేసిఆర్.