చిట్యాల, నేటి ధాత్రి :
చిట్యాల మండల కేంద్రంలో ఉన్న ఆదర్శ పాఠశాల /కళాశాలలో సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని ప్రిన్సిపాల్,మేకల రమేష్, సమక్షంలో ఎన్,ఎస్,ఎస్, ప్రోగ్రాం ఆఫీసర్ వాసాల వెంకటేశ్వర్లు, ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు
ఈ సంబరాలలో విద్యార్థిని విద్యార్థులకుముగ్గుల పోటీలు ఆటల పోటీలు వ్యాసరచన వకృత్వ పోటీలను నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అనేది మన హిందువుల పండుగ ఈ పండుగలో అనేక రకమైనటువంటి, తీపి వంటకాలు ముగ్గుల పోటీలు,గొబ్బెమ్మలు, గంగిరెద్దుల విన్యాసాలు బసవన్నల సంబరాలు పతంగుల విన్యాసాలు, పిల్లల ఆటపాటలతో ఉల్లాసంగా ఉత్సాహంగా పండుగను పిల్లలు పెద్దలు అందరూ సంతోషంగా జరుపుకుంటారు అని అన్నారు
అనంతరం, పోటీలలో గెలిచిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను అందజేశారు, ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు నీలం రవీందర్, సమీరా, వాణి, ఆయేషా, శివ, రాజు ,జోష్ణ, శ్రీలత,ప్రసన్న శ్రీకాంత్, ఎండి కలీం పాషా, రామస్వామి, వేల్పుల భాస్కర్, రాజేంద్రప్రసాద్, మోరేసాగర్, పుట్టరాజు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.