సమస్యలు వివరించిన డివిజన్ అధ్యక్షుడు కురిమిళ్ళ సంపత్
నేటిధాత్రి, వరంగల్
మంత్రి కొండా సురేఖ ఆదేశానుసారం వరంగల్ తూర్పు నియోజకవర్గం 28వ డివిజన్లో, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ పర్యటన చేపట్టారు. లోతట్టు ప్రాంతాలైనటువంటి సంతోష్ మాత కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, సాయినగర్ కాలనీ లలో సందర్శించి, బొంది వాగు సమస్య వలన రాబోయే భారీ వర్షాలకు నీట మునుగుతున్నటువంటి కాలనీల సమస్య పరిష్కారం కొరకు 158 కోట్లు కేటాయించడం జరిగింది అని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. దానికి సంబంధించిన పనులను సందర్శన చేసి, తగు సూచనలు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, 28వ డివిజన్ అధ్యక్షుడు కురిమిళ్ళ సంపత్, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు