ప్రధానోపాధ్యాయులు
అచ్చ సుదర్శన్
నడికూడ,నేటిధాత్రి:మండలంలోని చర్లపల్లి గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా చర్లపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ వినూత్న రీతిలో బడిబాట కార్యక్రమాన్ని మంగళవారం రోజున చేపట్టారు. తన మోటార్ సైకిల్ పై మైక్ ను కట్టుకొని చర్లపల్లి గ్రామంలో వీధి వీధి తిరుగుతూ,ఇంటింటికి పోయి విద్యార్థులను నమోదు చేసుకోవడం జరిగింది.ప్రభుత్వ పాఠశాల యొక్క ప్రత్యేకతలను మరియు ప్రభుత్వ పాఠశాలల యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్న తెలియజేస్తున్నటువంటి పాటలను తల్లిదండ్రులకు వినిపిస్తూ వారిని ఆకర్షించుకోవడమే కాకుండా విద్యార్థులను నమోదు చేసుకోవడం జరిగింది.