నేటిధాత్రి వరంగల్
దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యాలయం శివనగర్ వరంగల్ తమ్మెర భవన్ యందు ఈనెల 18, 19, 20న యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరి గుట్ట లక్ష్మినర్సింహా స్వామి ఫంక్షన్ హాల్లో జరుగు రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలనీ వరంగల్ జిల్లా అధ్యక్షా కార్యదర్శులు సంఘీ ఎలేందర్, జన్ను రవి కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దళిత హక్కుల పోరాట సమితి సీనియర్ నాయకులు గుండె బద్రి, మరియు దళిత హక్కుల పోరాట సమితి ఖిలా వరంగల్ మండల కార్యదర్శి రాచర్ల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు