vidyarthiki sanmanam, విద్యార్థికి సన్మానం

విద్యార్థికి సన్మానం

పదవతరగతి పరీక్షల్లో 10/10 జిపిఎ సాధించిన విద్యార్థి బానోతు రవీంద్రను నర్సంపేట లయన్స్‌ క్లబ్‌ జోనల్‌ చైర్‌పర్సన్‌ వైద్యుడు భరత్‌రెడ్డి శాలువాతో సన్మానించి 5వేల పారితోషికాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వైద్యుడు భరత్‌రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట మండలంలోని పర్శనాయక్‌ తండా గ్రామానికి చెందిన బానోతు ప్రేమ్‌సింగ్‌-అమతల కుమారుడు రవీంద్ర అనే విద్యార్థికి పండ్ల సమస్యతో చికిత్స అందిస్తున్న సందర్భంగా పదవ తరగతిలో 10/10 జిపిఎ సాధిస్తే సన్మానిస్తానని తెలపగా, అదే పట్టుదలతో ఉత్తీర్ణత సాధించినట్లు తెలపడంతో ఆశ్చర్యానికి గురయ్యానని తెలిపారు. దీంతో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విద్యార్థికి నగదుతోపాటు శాలువాతో ఘనంగా సన్మానించినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో తండాల నుండి ఉత్తీర్ణత సాధిస్తే సన్మానించనున్నట్లు వైద్యుడు భరత్‌రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *