New Sarpanch Nazia Anjum Wins Public Praise
తుమనపల్లి గ్రామ ప్రజా సేవ, నూతన సర్పంచ్ నాజియా అంజూమ్ షైక్ సోహైల్..!!
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల కేంద్రంలో బీఆర్ఎస్ యువ నాయకుడు తుమనపల్లి గ్రామ నూతన సర్పంచ్ నాజియా అంజూమ్ షైక్ సోహైల్ ప్రజల ప్రశంసలు పొందుతున్నారు. గ్రామంలో జరిగే అనేక కార్యక్రమాలలో పాల్గొంటూ, అతను అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య భేదం లేకుండా అధికారుల నుండి తెలుసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి తెలియని వారికి తెలియజేసి, వారికి సహాయం చేస్తాడు.అతను గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర ఉండి ప్రతి సమస్యలను అడిగి తీసుకుంటున్న వృద్ధులకు అండగా నిలబడి, వారికి సహాయం చేస్తున్నాడు.ఆయన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మరియు వితంతు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేవారికి మార్గనిర్దేశం చేస్తూ, అధికారులతో సమన్వయం చేస్తూ, మీసేవా కేంద్రాలలో దరఖాస్తుల ప్రక్రియను సులభతరం చేస్తున్నారు. అంతేకాకుండా, అతను గ్రామంలోని మండల నాయకులు మరియు ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ, అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ, అందరి నుండి ప్రశంసలు పొందుతున్నాడు. రాబోయే రోజుల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ, మరెన్నో పనులలో అందరితో కలిసి పనిచేస్తానని, పేద ప్రజలకు తన సహాయ సహకారాలు అందిస్తానని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, అన్ని కుల (సామాజిక) వర్గాలలో జరిగే ప్రతి కార్యక్రమంలో తాను పాల్గొని, తన సహాయ సహకారాలు అందించి, గ్రామంలో జరిగే అన్ని కార్యక్రమాలను ముందుకు నడిపిస్తానని ఆయన తెలిపారు. ప్రత్యేకంగా, తాను పేద ప్రజలకు తన మద్దతును అందిస్తానని ఆయన పేర్కొన్నారు. మండల ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజా ప్రతినిధులు సేవలను అభినందిస్తున్నారు
