TDP Slams Ambati Rambabu Over Obscene Remarks
అంబటి రాంబాబు అసభ్య వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి..
తిరుపతి (నేటిధాత్రి:
అంబటి రాంబాబు చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు నిరసనగా తిరుపతి నియోజకవర్గంలో జరిగిన నిరసన కార్యక్రమంలో తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులతో కలిసి నిరసన వ్యక్తం చేస్తూ అంబటి రాంబాబు తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఈ సందర్భంగా డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ:”బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు మాట్లాడేటప్పుడు సంస్కారం ఉండాలని, అంబటి రాంబాబు వ్యాఖ్యలు చూస్తుంటే ఆయనకు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని అర్థమవుతోందని మండిపడ్డారు.
రాజ్యాంగబద్ధమైన పదవుల్లో పనిచేసిన వారు మాట్లాడేటప్పుడు కనీస విజ్ఞతను ప్రదర్శించాలని, నోటికొచ్చినట్లు మాట్లాడటం అంబటి రాంబాబు అహంకారానికి పరాకాష్ట అని విమర్శించారు.
గతంలో ప్రజలు అధికారం నుండి దూరం చేసినా వైసీపీ నాయకుల్లో మార్పు రావడం లేదని, ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
వ్యక్తిగత దూషణలు చేయడం మాని, అభివృద్ధిపై మాట్లాడాలని.. నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేశారు.
రాజకీయాల్లో హుందాతనాన్ని కాపాడటమే తమ ధ్యేయమని, ఇటువంటి అరాచక మాటలను ఇకపై సహించే ప్రసక్తే లేదని డాలర్స్ దివాకర్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
స్థానిక బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి ఈస్ట్ పోలీస్ స్టేషన్ దగ్గరవరకు ర్యాలీ గా తరలి వెళ్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ పిర్యాదు ఇవ్వడం జరిగింది.
ఈ నిరసన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రీనరీ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ యాదవ కార్పొరేషన్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, శాప్ చైర్మన్ రవి నాయుడు కోడూరు బాల సుబ్రమణ్యం, దంపూరు భాస్కర్ యాదవ్, యశ్వంత్ రెడ్డి,శంకర్ నారాయణ, తెదేపా నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు..
