విద్యుత్ షాక్ తో రైతు మృతి..
ఓదెల (పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండలంలోని జీలకుంట గ్రామంలో కరెంట్ షాక్ తో రైతు మృతి గ్రామంలో అలుముకున్నాయి జీలకుంట గ్రామానికి చెందిన నల్ల శ్రీనివాస్ రెడ్డి వయసు 41 గురువారం రాత్రి వర్షం కురవడంతోటి తన ఇంటిలోనికి కరెంటు రాకపోవడంతో తడి కర్ర తీసుకొని కరెంటు పోల్ పై కార్బన్ వచ్చిందో ఏమో అని కర్రతోటి కదిలిస్తున్న తరుణంలో కర్రకు కరెంటు వచ్చి వెంటనే కింద పడిపోవడంతో వెంటనే భార్య లక్ష్మి చూసి అప్రమత్తమై విషయాన్ని తన మామకు తెలుపగానే వెంటనే ఆసుపత్రికి తరలించారు.అప్పటికే మృతి చెందిన శ్రీనివాస్ రెడ్డిని చూసి చనిపోయాడని తెలపడంతో కుటుంబంలో ఒక్కసారి విషాద చాయలు అలుముకున్నాయి.మృతుడికి భార్య ఇద్దరు కొడుకులు మొదటి కొడుకు బీటెక్ చదువుతున్నాడు.చిన్న కొడుకు ఇంటర్ ఫస్టియర్ జాయిన్ అయ్యాడు.నిన్న మొన్నటిదాకా అందరితో కలివిడిగా తిరిగిన వ్యక్తి కరెంటు షాక్ తో మృతి చెందడంతో గ్రామంలో మరియు కుటుంబంలో విషాదం నెలకొంది.కుటుంబ పెద్ద చనిపోవడంతో భార్య విలపిస్తున్న తీరు చూసి గ్రామంలో పలువురినీ కంటతడి పెట్టించింది.విషయం తెలుసుకున్న ఎస్ఐ అశోక్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాద గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.మృతుడి భార్య లక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ రెడ్డి తెలిపారు.