నాటి జ్ఞాపకాలు మరుపు రానివి

•20 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనం…
•2003-04 బ్యాచ్ విద్యార్థులు

నిజాంపేట: నేటి ధాత్రి

20 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులు తోటి విద్యార్థులతో సమ్మేళనం ఏర్పాటు చేశారు..ఈ మేరకు నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ ఉన్నత పాఠశాలలో 20 సంవత్సరాల క్రితం (2003-04) బ్యాచ్ కి సంబంధించిన విద్యార్థులు ఆనాటి ఉపాధ్యాయులైన భాస్కర్, లక్ష్మణ్ లను సమ్మేళనానికి ఆహ్వానించారు. వారికి విద్యను బోధించి ఉన్నత శిఖరాలకు చేరుకునేలా తోడ్పడిన ఉపాధ్యాయులను సన్మానించారు. అనంతరం విద్యార్థులు తమ తోటి స్నేహితులతో సంతోషంగా గడిపారు. గడిచిన రోజులు మళ్ళీ రావని ఆనాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *