Vijay Nears Power
తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒక్కటే ప్రశ్న..!
విజయ్ సీఎం కుర్చీకి ఇంకెంత దూరం..?
108 సీట్లతో రాజకీయ భూకంపమే సృష్టించిన టీవీకే పార్టీ.. అధికారానికి మాత్రం ఇంకా 11 అడుగుల దూరంలోనే నిలిచిపోయింది. అంతేకాదు.. రెండు చోట్ల గెలిచిన విజయ్ ఒక సీటుకు రాజీనామా చేయాల్సి రావడంతో టీవీకే బలం 107కే పరిమితం కానుంది. కాంగ్రెస్ ఐదుగురు ఎమ్మెల్యేలతో విజయ్‌కు మద్దతు పలికినా.. మ్యాజిక్ ఫిగర్ 118 చేరాలంటే ఇంకా ఆరుగురు కావాలి. దీంతో ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో మొదలైంది అసలైన గేమ్..! విజయ్‌కు చేయి అందించేది ఎవరు..? ఇదే ఇప్పుడు చెన్నై కారిడార్లలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇలాంటి హైటెన్షన్ పొలిటికల్ సీన్ మధ్యే సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంట్రీ ఇవ్వడం సంచలనంగా మారింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత స్టాలిన్‌ను ఆయన నివాసంలో రజనీ కలవడం రాజకీయ వర్గాల్లో భారీ చర్చకు దారి తీసింది. డీఎంకే వర్గాలు ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ అంటున్నా.. సోషల్ మీడియాలో మాత్రం మరో కథ నడుస్తోంది. దశాబ్దాలుగా బద్దశత్రువులుగా ఉన్న డీఎంకే-అన్నాడీఎంకే మధ్య రజనీ సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారన్న ప్రచారం వేగంగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా స్టాలిన్-రజనీ భేటీ ఫొటో బయటకు రావడంతో తమిళ రాజకీయాల్లో కొత్త లెక్కలు మొదలయ్యాయి.
ఎందుకంటే సంఖ్యలు ఇప్పుడు షాకింగ్ సమీకరణాలను చూపిస్తున్నాయి. డీఎంకే కూటమికి ప్రస్తుతం 68 మంది ఎమ్మెల్యేలు.. అన్నాడీఎంకే కూటమికి 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ రెండు కూటములు చేతులు కలిపితే సంఖ్య 121కి చేరుతోంది. అంటే మ్యాజిక్ ఫిగర్ దాటేసి.. విజయ్ను అధికారానికి దూరంగా పెట్టే శక్తి ఆ కూటమికి వస్తుంది. ఇదే ఇప్పుడు తమిళ రాజకీయాల్లో సెన్సేషన్ డిబేట్‌గా మారింది. “విజయ్ అలకు బ్రేక్ వేయడానికి పాత శత్రువులే ఒక్కటవుతారా..?” అన్న ప్రశ్న రాజకీయ వర్గాలను వేడెక్కిస్తోంది.
అయితే ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది..! కరుణానిధి-ఎంజీఆర్ కాలం నుంచి పరస్పర విరోధులుగా ఉన్న డీఎంకే, అన్నాడీఎంకే నిజంగానే కలిసే అవకాశం ఉందా..? కేడర్ అంగీకరిస్తుందా..? సిద్ధాంతాలు పక్కన పెట్టి అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తారా..? అనే చర్చ ఇప్పుడు తమిళనాడులో తారాస్థాయికి చేరింది. మరోవైపు డీఎంకే మాత్రం అలాంటి ఆలోచనలే లేవంటూ క్లారిటీ ఇస్తోంది. కానీ రాజకీయాల్లో కనిపించేది ఒకటి.. జరిగేది మరోటి..! అందుకే ఇప్పుడు తమిళనాడు రాజకీయాలపై ఒక్క మాట గట్టిగా వినిపిస్తోంది…
