Greater Game Begins
గ్రేటర్ గేమ్ స్టార్ట్..!
మోదీ సభలో మల్లారెడ్డి?
ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్..!
తెలంగాణ గడ్డపైకి వస్తున్నారు ప్రధాని మోదీ..!
కానీ ఇది కేవలం టూర్ మాత్రమేనా..?
లేక తెలంగాణ రాజకీయాల్ని షేక్ చేసే “ఆపరేషన్ ఆకర్ష్” ప్రారంభమా..?
జూన్ 10… హైదరాబాద్ రాజకీయాల్లో హై వోల్టేజ్ డేగా మారబోతోందన్న చర్చ మొదలైంది..!
మధ్యాహ్నం బేగంపేటలో ల్యాండ్ అయ్యే మోదీ… సాయంత్రం వరకూ అధికార, పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉండనున్నారు..!
కానీ ఇప్పుడు అసలు చర్చ మోదీ స్పీచ్ గురించికాదు..!
మోదీ స్టేజ్‌పై ఎవరు కనిపించబోతున్నారు అన్నదే హాట్ టాపిక్..!
గ్రేటర్ హైదరాబాద్‌ను సెమీ ఫైనల్‌గా చూస్తోంది బీజేపీ..!
జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పొరేషన్లపై కాషాయ జెండా ఎగరేయాలని… కమలనాథులు భావిస్తున్నారట..!
అందుకే బీఆర్ఎస్, కాంగ్రెస్‌లో అసంతృప్త నేతల లిస్టు ఇప్పటికే రెడీ అయ్యిందన్న టాక్ వినిపిస్తోంది..!
ఇక ఇప్పుడు అందరి చూపు ఒకే కుటుంబంపై పడింది..!
మాజీ మంత్రి మల్లారెడ్డి అండ్ ఫ్యామిలీ నిజంగానే కమలం గూటికి చేరబోతున్నారా..?
ఢిల్లీ వెళ్లి మోదీని కలవడం…
బీజేపీ ఆఫీస్ వద్ద ప్రీతీరెడ్డి కనిపించడం…
ఇవన్నీ కేవలం మర్యాద పూర్వక భేటీలా..?
లేక “పొలిటికల్ షిఫ్ట్”కి సిగ్నల్సా..?
మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, భద్రారెడ్డి, ప్రీతీరెడ్డి…
ఈ నలుగురు ఒకేసారి కమలం కండువా కప్పుకుంటారన్న ప్రచారం ఇప్పుడు బీఆర్ఎస్లోనే టెన్షన్ పెంచుతోందట..!
పైగా బీజేపీ నేతలు కూడా ఈ విషయంపై క్లారిటీ ఇవ్వకుండా… “చూద్దాం” అన్నట్టుగా స్పందించడం మరింత హీట్ పెంచుతోంది..!
ఇక కాంగ్రెస్‌కూ షాక్ రెడీ చేస్తున్నారట కమలనాథులు..!
గ్రేటర్లో బలమైన కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేసి…
“ఆపరేషన్ ఆకర్ష్ 2.0”కి స్కెచ్ వేసినట్టు ప్రచారం జరుగుతోంది..!
మోదీ సభ వేదికగా భారీ జంపింగ్స్ ఉంటాయన్న లీకులు… ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సెన్సేషన్‌గా మారాయి..!
మరి…
మోదీ సభలో కేవలం రాజకీయ ప్రసంగాలే వినిపిస్తాయా..?
లేక తెలంగాణ రాజకీయాల్ని తలకిందులు చేసే భారీ చేరికలు కూడా ఉంటాయా..?
జూన్ 10న కమలం పేల్చబోయే పొలిటికల్ బాంబ్ ఏంటి..?
