Government Neglecting Farmers: Kishan Reddy
ముత్తారం ప్రజా పాలన ప్రగతి పథం లో ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతున్నారు
ముత్తారం బి ఆర్ ఎస్ మండల శాఖ అధ్యక్షుడు పోతుపెద్ది కిషన్ రెడ్డి
ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండలం ఓడెడ్ గ్రామం లోని తన స్వగృహం లో విలేఖర్లతో కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి పథం పేరు తో కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ అధికారులు ఏం అబివృద్ధి చేశారని గ్రామలలో పర్యటిస్తున్నారని ప్రశ్నించారు
ప్రజా పాలనలో రైతుల ఇబ్బందులు కనపడడం లేదా రైతులకు పంట సాయం లేదు
ఎరువులకు ఇబ్బందులే కొనుగోలు కేంద్రాల లో ఇబ్బందులతో సతమౌతున్నారని ఆరోపించారు యూరియా వాడకాన్ని తగ్గించాలని సేoద్రియ సేద్యం చేయాలని ప్రకటిస్తున్న ప్రభుత్వం ఇప్పటివరకు జీలుగా పెసర జనుము విత్తనాలు అందుబాటులో లేవని ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ మొదలవుతుందని రైతులు సేంద్రియా వ్యవసాయo చేయాలంటే విత్తనాలు అందుబాటులో ఉండాలని , సంబంధిత అధికారులు విత్తనాల కు ఇండెంట్ పెట్టాం ఇంకా రాలేదని మాట దాటవేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు
