కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం.
డప్పుసప్పుళ్లతో సంబరాలు జరుపుకున్న పార్టీ శ్రేణులు కార్యకర్తలు
పరకాల నేటిధాత్రి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల లో బీసీ కులగణన,ఎస్సి కుల వర్గీకరణ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి వాటిని ఆమోదించిన సందర్బంగా బుధవారం రోజున పట్టణంలోని బస్టాండ్ కూడలిలో పట్టణ,మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్,మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి,ఏఏంసి చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి బీసీ కులగణన కార్యక్రమాన్ని చెప్పటి బిల్లును అసెంబ్లీ లో ఆమోదించడానికి,అలాగే సుప్రీంకోర్టు ఎస్ సి వర్గీకరణ పై ఇచ్చిన తీర్పును గౌరవించి దేశంలోని మొట్టమొదటిసారిగా ఎస్సి వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లును ఆమోదించడానికి కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి పరకాల కాంగ్రేస్ పార్టీ తరుపున కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పరకాల సమన్వయ కమిటీ సభ్యులు సోద రామకృష్ణ, కుంకుమేశ్వర్ టెంపుల్ చైర్మన్ కొలుగురి రాజేశ్వరరావు, మాజీ కౌన్సిలర్లు పంచగిరి జయమ్మ,మడికొండ సంపత్ కుమార్,మాజీ ఎంపీపీ రామ్మూర్తి,చిన్నల గొనాద్, నల్లబోల కృష్ణయ్య అల్లం రఘునారాయణ,దాసరి బిక్షపతి,మడికొండ సంపత్,బండి సదానందం గౌడ్,పసుల రమేష్,మార్క రఘుపతి గౌడ్,నల్లెల అనిల్ బొమ్మ కంటి చంద్రమౌళి దుబాసి వెంకటస్వామి,అంబిరు మహేందర్,సుంకరి దిలీప్, ఎండి తాజుద్దీన్,ఎండి ఆజి, బొచ్చు జెమిని,మచ్చ సుమన్, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.