TDP Leaders Celebrate Ambedkar Jayanti
అంబేద్కర్ జయంతి వేడుకలలో తెలుగుదేశం పార్టీ నేతలు
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లా తెలుగుదేశం పార్టీ అద్యరములో డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలలో తెలుగుదేశం పార్టీనేతలు పాల్గొన్నారు డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన o గా నివాళులర్పించారు
ఈసందర్భంగా తెలుగుదేశం పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంట్ కన్వీనర్ రాములు మాట్లాడుతూ సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు ఒక కులానికి లీడర్ కాదు ,ప్రతి మహిళ సమస్య కోసం పోరాటం ,కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసిన మహనీయుడు.
ఆ మహనీయుని ఆశయాలను కొనసా గి నా oచాలని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వనపర్తి పట్టణ అధ్యక్షులు లక్ష్మయ్య , షాకీర్ హుస్సేన్ ,ఆవుల శ్రీను, గంధం ట్రాక్టర్ బాలయ్య చిన్నయ్య,అప్పాయిపల్లి బాలయ్య , జి లక్ష్మయ్య,జి కృష్ణయ్య, శేఖర్, రాజు మేస్త్రి, దాసు, కొత్తగొల్ల శంకర్ ద్యారపోగు బాలరాజు తదితరులు పాల్గొన్నారు
