వనపర్తి లో తెలంగాణ జనసమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లా కేంద్రంలో తెలంగాణ జన సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర జన సమితి పార్టీ 8వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించామని
తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఎం.ఏ. ఖాదర్ పాషా ఒక ప్రకటన లో తెలిపారు ప్రొఫెసర్ జయశంకర్.డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించమని చెప్పారు .
ఖాదర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆశయాల కోసం ఏర్పడిందో ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు నెరవేరాలంటే తెలంగాణ జన సమితి పార్టీ అవసరం అని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, ఉద్యోగా లతో పాటు పార్టీ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు తెలంగాణ జనసమితి పార్టీ జెండా ఎగురవేసిన తరువాత తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నివాళులర్పించారు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం కు వారు కృతజ్ఞతలు తెలిపారు, వనపర్తి జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు వనపర్తి లో పూర్తి కాని రోడ్డ విస్తరణ జర్నలిస్టులకు నూతన అక్రిడేషన్ కార్డులు జారీ ప్రభుత్వ ఇండ్ల స్థలాలు ఇప్పించు టకు ప్రభుత్వం తో రాజీలేని పోరాటం చేస్తామని అయన తెలిపారు
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు య౦ఏ,ఖాదర్ పాష
జిల్లా ఉపాధ్యక్షులు గండు శివ.
జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి షఫీ
టౌన్ ప్రధాన కార్యదర్శి శాంతారా౦ నాయక్. రతన్ నాయక్. చంద్రశేఖర్ ఎండి గౌస్ పాషా
కమిటీ సభ్యులు, మండల నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారని అయన పేర్కొన్నారు
