World Dance Day Wishes by Master Raparthi Pawan
ప్రపంచ డాన్స్ డే శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ రాపర్తి పవన్
భూపాలపల్లి నేటిధాత్రి
ప్రపంచ డాన్స్ డే సందర్భంగా మాస్టర్ రాపర్తి పవన్ నృత్య కళాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నృత్యం అనేది కేవలం వినోదానికి పరిమితం కాకుండా భావాలను వ్యక్తపరచే గొప్ప కళారూపమని పేర్కొన్నారు.
ప్రతి వ్యక్తిలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసే శక్తి నృత్యానికి ఉందని, మన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడంలో కూడా నృత్యం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన వివరించారు.
నృత్య కళను అభ్యసిస్తున్న యువత మరింత ప్రోత్సాహం పొందాలని ఆకాంక్షిస్తూ, ఈ రంగంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
