`దుకాణాలు తెరిచిన ఉద్యోగ సంఘాల నేతలు!
`తూకాన్నీ బట్టి సిఫారసుల లెటర్లు!
`అనువైన చోటకు ఒక రేటు.. బదిలీ వద్దనుకుంటే మరో రేటు!
`ఆరేళ్లు ఒకే చోట ఉద్యోగం చేశాఖ బదిలీ తప్పని సరి!
`వద్దనుకునే వారు తప్పించుకునేందుకు ఉద్యోగ సంఘాల సిఫారసులు.
`జనగణమన చేస్తున్న వారికి బదిలీలో మినహాయింపులు.
`ఆ విషయం తెలియక కొందరు డ్యూటీలు వేయించుకోలేదు.
`కేంద్రం ఇచ్చిన ఆదేశాలు ఉగ్యోగుల గొంతులో వెలక్కాయలు.
`రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే బదిలీలకు అనుమతి ఉత్తర్వులు.
`ట్రాన్స్ ఫర్ తప్పించుకునేందుకు కొంత మంది తొక్కుతున్న అడ్డ దారులు.
`ఉద్యోగ సంఘాల నేతలతో బేరసారాలు.
`ఉగ్యోగ సంఘాల నేతల ఇళ్లకు క్యూ కడుతున్న ఉద్యోగులు.
`ఉద్యోగ స్థాయిని బట్టి వసూలు చేస్తున్న సంఘాలు.
`అవసమైతే ఉద్యోగ సంఘాలలో కూడా పదవుల పంపకాలు.
`బదిలీలు అపుకునేందుకు ఎంత ఖర్చుకైనా వెనుకాడని ఉద్యోగులు.
`నిజమైన ఉద్యోగులకు తీరని అన్యాయం జరుగుతుందని గగ్గోలు.
`దశబ్దాలుగా తిష్ట వేసుకుని కూర్చున్న ఉద్యోగులకు సంఘాల సహకారాలు.
`వ్యాపారులుగా మారిన ఉద్యోగ సంఘాల నాయకులు.
`బదిలీలో సిఫారసులలో యూనియన్ నాయకులకు కురుస్తున్న కాసుల వర్షం.
`బదిలీలు తప్పించు కోవాలనుకుంటే సెన్సెస్ తప్పుడు ధ్రువ పత్రాలు!?
`బదిలీల కోసం ఇంత కాలం ఎదురు చూస్తున్న వారికి ఎదురవుతున్న అడ్డంకులు!
హైదరాబాద్, నేటిధాత్రి:
ఉద్యోగులకు వరంగా మారాల్సిన సాదారణ బదిలీలు నరకంగా మారుతున్నాయి. శాపంగా పరిణమిస్తున్నాయి. లక్షలకు ýక్షలు ఖర్చులు చేయిస్తున్నాయి. అయినా ఫరవాలేదు. కోరుకున్న చోటకు బదిలీ అయితే చాలు అనుకునే ఉద్యోగులు చాలా మంది వున్నారు. నూటికి 70శాతం మంది తమకు నచ్చిన చోటకు బదిలీ కోరుకుంటున్నారు. దాంతో బదిలీల ప్రక్రియలో వింతలు చోటు చేసుకుంటున్నాయి. అవినీతి మయమౌతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఉద్యోగ సంఘాలకు కాసులు కురిపిస్తున్నాయి. సాదారణ బదిలీలలో కొంత మంది అనార్యోగంతో వున్న ఉద్యోగులు అనుకూలమైన ప్రాంతాలు కోరుకుంటారు. అది తప్ప్పు లేదు. కాని వాళ్లు తమ సౌకర్యం కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. పైగా వారుకోరుకునే స్దానాలకు ఇతరులు పోటీ పడినప్ప్పుడు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలా అవసరం వున్నా, లేకున్నా తమకు ఇష్టమైన చోటు కోసం కొంత మంది ఉద్యోగులు ఎంత ఖర్చుకైనా వెనుకాడడంలేదు. ఉద్యోగ సంఘాల నాయకుల సిఫారసు లెటర్లు చాలు. కోరుకున్న చోటకు బదిలీ కావొచ్చన్న భరోసా ఏర్పడింది. ఒకప్ప్పుడు ప్రభుత్వం ఎక్కడికి బదిలీ చేస్తే అక్కడికి ఉద్యోగులు వెళ్లేవారు. అలా ఆరేళ్లకోసారి సాదారణ బదిలీలకు అలవాటు పడేవారు. కాని ఇప్ప్పుడు ఉద్యోగులు కోరుకున్న చోటు కావాలి. కోరుకున్న ప్రాంతానికి మాత్రమే బదిలీ జరగాలని కోరుకుంటున్నారు. అందుకోసం పైరవీలు, పైసలకు వెనుకాడడం లేదు. అందుకు కారణం అనేకం వుంటాయి. దాని వెనకు మతలబులు చాలా వుంటాయి. అందుకే అలాంటి ప్రాంతాలకు బదిలీ కోరుకుంటారు. కొందరు బదిలీలు తప్పించుకుంటున్నారు. బదిలీలు కోరుకునే వారికంటే బదిలీలు తప్పించుకోవాలని చూస్తున్న వారు క్రమంగా పెరుగుతున్నారు. ఇలా రెండు రకాల ఉద్యోగులు ప్రతి బదిలీల సమయాల్లోనూ వుంటారు. కాని ఈసారి చాలా ఎక్కువగా వున్నారని తెలుస్తోంది. యÖనియన్ నాయకులకు కాసుల పంట పండుతోందని తెలుస్తోంది. ఈ సాదారణ బదిలీలలల్లో పెద్దఎత్తున అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని తెలుస్తోంది. ఉద్యోగ సంఘాల నాయకులు సిఫారసుల కోసం తూకం పెట్టేస్తున్నారని సమాచారం. అయితే ఇక్కడ రెండు విషయాలు దాగి వున్నాయి. సహజంగా బదిలీ కోరుకునే వారు తమకు ఇష్టమైన స్దానం ఎంచుకోవడం కోసం పెద్దఎత్తున పైరవీలు చేస్తున్నారు. అలాగే బదిలీ వద్దనుకునేవారు అంతంకంటే ఎక్కువగా వున్నారు. ఇప్పటికే ఏదో ఒక చోట స్ధిర నివాసం ఏర్పరుచుకోవడం, ఇతర వ్యాపారాలు మొదలు పెట్టిన వారు చాలా మంది ఉద్యోగులున్నారు. అందులో అన్ని శాఖలకు చెందిన ఉద్యోగులుంటారు. అటు ఫైనాన్స్ వ్యాపారాలు, ఇటు రియల్ వ్యాపారాలు చేస్తున్న ఉద్యోగులు వున్నారు. వీటికి తోడు నిత్య సంపాదన వున్న ఉద్యోగులు కూడా వుంటారు. వాళ్లు బదిలీలను కోరుకోవడం లేదు. స్ధానం మారడం వారికి ఇష్టం లేదు. ఇక విద్యాశాఖలో ఉపాధ్యాయ ఉద్యోగులు కూడా అదే బాటను ఎంచుకుంటున్నారు. వాళ్లు కూడా ఉద్యోగంతోపాటు, ఇతర వ్యాపకాలు పెంచుకున్నారు. అలాంటి ఉద్యోగులు బదిలీని అసలే కోరుకోవడం లేదు. పైగా ఎంతో కొంత సంపన్నులుగా మారిపోయారు. అలాంటి వారు ఎంత ఖర్చుకైనా వెనుకాడరు. అది ఉద్యోగ సంఘాల నాయకులకు వరంగా మారింది. కాసుల వేటకు అవకాశం కల్పించింది. ఇటీవలే కేంద్రం దేశ వ్యాప్తంగా జనగనణ (సెన్సెస్) మొదలు పెట్టింది. ఆ సెన్సెస్‌లో కొంత మంది ఉపాద్యాయ ఉద్యోగులు పాలు పంచుకుంటున్నారు. కొంత మంది పాలు పంచుకోవడం లేదు. ఆ బాధ్యతను తీసుకోలేదు. అనుకోకుండా దేశ వ్యాప్తంగా సెన్సెస్‌లో పాలు పంచుకుంటున్న ఉద్యోగులకు బదిలీలు వుండొద్దని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. సెన్సెస్ డ్యూటీ వేయించుకోని ఉద్యోగులకు ఈ ప్రకటన గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైంది. తాము కూడా జనగణనలో పాల్గొంటే బాగుండేదన్న భావన కలిగింది. బదిలీ నుంచి తప్పించునే అవకాశం వుండేదని ఆశ కల్గింది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సాదారణ బదిలీలకు అనుమతులిచ్చింది. అంటే ఇప్ప్పుడు సెన్సెస్‌లో పాలు పంచుకుంటున్న ఉద్యోగులకు ఉపశమనం కలిగింది. సెన్సెస్‌లో పాలు పంచుకోవడం లేని ఉద్యోగుల మెడమీద కత్తి వేలాడినట్లైంది. జనగణన బాద్యతనుంచి తప్ప్పుకుంటే, బదిలీ వేటు గురయ్యే ప్రమాదం ముంచుకొచ్చిందని మధనపడుతున్నారు. ఇక్కడ బదిలీ కోరుకునే ఉద్యోగులకు పెద్ద ఇబ్బంది లేదు. కాని బదిలీ వద్దనుకునేవారికి ఇబ్బందికరమైన పరిస్దితి ఎదురైంది. అయితే బదిలీ కోరుకునే వారైనా సరే తాము కోరుకున్న చోటకు బదిలీ జరిగితే బాగుండనే ఆశ పుట్టింది. ఇంకేముంది ఉద్యోగ సంఘాల నాయకులతో సంప్రదింపులు మొదలు పెట్టారు. బేరసారాలకు తెర తీశారు. అలా రెండు రకాలుగా ఉద్యోగ సంఘాలకు కాసులు కూడేందుకు సమయం కలిసొచ్చింది. ఇలాంటి పరిస్దితి గతంలో ఉద్యోగ సంఘాల నాయకులకు రాలేదు. ఈ అనుకూల సమయాన్ని సొమ్ము చేసుకోవాలని ఉద్యోగ సంఘాల నాయకులు చూస్తున్నారు. అడిన వాళ్లందరికీ సిఫారసు లెటర్లు చేతుల్లో పెడుతున్నారు. ఇలా వందలాది లెటర్లు ఉద్యోగ సంఘాల నాయకులు అమ్ముకుంటున్నట్లు తేలుస్తోంది. ఆ అమ్మకాల ప్రక్రియ హైదరాబాద్ నుంచి జిల్లాలకు కూడా చేరినట్లు సమాచారం. ఉద్యోగ సంఘాలలో ప్రభుత్వం వద్ద గుర్తింపు పొందినవి వున్నాయి. కొన్ని లేనివి కూడా వున్నాయి. కాని ఆయా ఉద్యోగ సంఘాల నాయకులకు రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు పెద్దలతో పరిచయాలున్నాయి. వారి చేత పనులు చేయించుకోగలగిలే శక్తి సామర్ధ్యాలున్నాయి. అవి ఇప్ప్పుడు వారికి వరంగా మారాయి. సహజంగా ఓడి అనే ఆప్షన్ కేవలం యÖనియన్లల్లో అద్యక్ష, కార్యదర్శులకు మాత్రమే వుంటుంది. కాని ఉద్యోగ సంఘాల నాయకులు బదిలీకోసం వచ్చిన వారికి యÖనియన్‌లో ఏదో ఒక పదవి సృష్టించి మరీ బదిలీలు ఆపేందుకు సిఫారసులు చేస్తున్నారు. ఇదిలా వుంటే సెన్సెస్ దందా మరో రకంగా తయారైంది. ఎలాగైనా సరే బదిలీ నుంచి తప్పించుకోవాలనుకునే ఉద్యోగులు ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా అడ్దదారులు వెతుక్కుంటున్నారు. అయితే సెన్సెస్కు సంబందించిన ఉద్యోగుల ఎంపిక జనవరి నెలలోనే జరిగింది. ఆ తర్వాత వారికి శిక్షణా తరగతులు కూడా నిర్వహించింది. వాళ్లు సెన్సెస్‌లో గత నెల నుంచి పనిచేస్తున్నారు. రాష్ట్ర ఆర్ధిక శాఖ సాదారణ బదిలీలకు అనుమతులు మంజూరు చేయడంతో ఒక్కసారిగా సెన్సెస్ డ్యూటీలు వేసుకోని ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. తమ బదిలీలు తప్పించుకునేందుకు సెన్సెస్ డ్యూటీలు ఒక్కటే మార్గమనుకుంటున్నారు. అందుకోసం అడ్డ దారులు తొక్కుతున్నారు. తప్ప్పుడు ఉత్తుర్వులు పాత తేదీలలో పొందుతున్నారు. అందుకు పెద్దఎత్తున ముడుపులు చెల్లించుకుంటున్నారు. నిజానికి అలాంటి బాధ్యత కావాలనుకంటే పెద్ద ప్రాసెస్ వుంది. అవన్నీ లేకుండా అడ్డదారుల్లో సెన్సెస్ డ్యూటీలు కొత్తగా పొందుతున్నారు. పాత తేదీలతో డ్యూటీలు చేయాలని చూస్తున్నారు. ఉన్నతాదికారులకు సెస్సెస్ లెటర్లు సమర్పించి, బదిలీల నుంచి తప్పించుకునేందుకు మార్గం వేసుకుంటున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇలా అడ్డదారుల్లో బదిలీలు లేకుండా చేసుకుంటూ, బదిలీలు కోరుకునే వారికి అడ్డంకిగా మారుతున్నారు. బదిలీలకు అవకాశం వున్న ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారు.
