Rajamouli’s Global Plan for Mahesh Babu Film
టార్గెట్ గ్లోబల్ బాక్సాఫీస్
జక్కన్న మాస్టర్ ప్లాన్!
వారణాసి’ నుంచి సరికొత్త అప్డేట్ వచ్చింది. యస్… ఏప్రిల్ 26 వరకు మెక్సికో సిటీలోని సెంట్రో బనామెక్స్లో జరగనున్న ‘కామిక్ కాన్ ఎక్స్పీరియన్స్’ ఈవెంట్లో “వారణాసి టు ద వరల్డ్” అనే పేరుతో ఒక ప్రత్యేక విజువల్ గ్లింప్స్‌ను ప్రదర్శించనున్నాడట మన జక్కన్న.
అయితే ఇది మనం రెగ్యులర్‌గా చూసే టీజర్, ట్రైలర్ లాంటిది కాదట. వరల్డ్‌వైడ్‌గా ఉండే ఆడియన్స్ కోసం స్పెషల్‌గా డిజైన్ చేసిన కంటెంట్. పైగా దీంట్లో మనమెప్పుడూ చూడని హై క్వాలిటీ బిహైండ్ ది సీన్స్ వీడియోలను తొలిసారిగా ఈ ఈవెంట్లో ప్లే చేయబోతున్నారట. ఇక ఈ ఈవెంట్లో జరగబోయే మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా… ‘వారణాసి’లో నటిస్తున్న హీరో, హీరోయిన్లతో పాటు కీలక పాత్రలు పోషించే వారి గురించి ఇందులో మరింత డీటైల్డ్‌గా వివరించబోతున్నారట. దీంతో పాటు సినిమాలో కొన్ని ఇంపార్టెంట్ సీన్స్‌ను కూడా ఇందులో స్క్రీన్ చేసే అవకాశం ఉందట. అంటే మన కన్నా ముందే మెక్సికన్ ఆడియన్స్ మన సూపర్ స్టార్ మహేశ్ బాబు మేకోవర్‌ను చూడబోతున్నారన్న మాట.
ఇక ఈ క్రేజీ ఈవెంట్ కోసం స్వయంగా రాజమౌళి కొడుకు ఎస్.ఎస్ కార్తికేయ మెక్సికోలో పనులు దగ్గరుండి చూస్తున్నాడని సమాచారం. మరోవైపు జక్కన్న షూటింగ్లో బిజీగా ఉన్నప్పటికీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పెషల్‌గా ఫ్యాన్స్‌తో ముచ్చటించి సినిమా విశేషాలను ఎక్స్ప్లెయిన్ చేయనున్నాడని తెలుస్తోంది.
