భూపాలపల్లి జిల్లా ప్రజావాణిలో రైతుల నిరసన…

భూపాలపల్లి జిల్లా ప్రజావాణిలో రైతుల నిరసన

భూపాలపల్లి నేటిధాత్రి

రైతులు ఖరీఫ్ కాలంలో సన్న వడ్లు అమ్ముకొని మూడు నెలలు కావస్తున్న ఇంతవరకు రైతులకు ప్రభుత్వం చెల్లించే వడ్ల బోనస్ రాలేదంటూ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్న ప్రజావాణిలో బైఠాయించి రైతులు నిరసన వ్యక్తం చేశారు
సోమవారం రోజు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సుమారు 60 మంది రైతులు తమ నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ పని తీరును ఎండగట్టారు. భూపాలపల్లి కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్న ప్రజావాణి వద్ద బైఠాయించిన రైతులు వరి పంటకు చెందిన బోనస్ డబ్బులు ఇంతవరకు చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వం వెంటనే బోనస్ చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ చేరుకున్న పోలీసులు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్న రైతులు వారి మాట పెడచెవిన పెట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ స్పందించి ఈ నెలలో రైతులకు సన్నబడ్లకు రావలసిన బోనస్ నగదు ఖాతాలలో జమ అయితదని హామీ ఇచ్చారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version