రాష్ట్రస్థాయి నుంచి సౌత్ ఇండియా స్థాయికి ప్రభుత్వ ఉపాధ్యాయుడు

రాష్ట్రస్థాయి నుంచి సౌత్ ఇండియా స్థాయికి ప్రభుత్వ ఉపాధ్యాయుడు.

చందుర్తి, నేటిధాత్రి:

 

చందుర్తి మండల కేంద్రంలోని పీఎం శ్రీ ప్రాథమిక పాఠశాలలో ఎస్జిటి ఉపాధ్యాయుడుగా పని చేస్తున్న కాపిల్ల నరేష్ ప్రాథమిక స్థాయిలో పిల్లలకు బోధించేందుకు తయారుచేసిన *బోధన అభ్యసన సామాగ్రి* రాష్ట్రస్థాయి నుండి సౌత్ ఇండియా స్థాయికి ఎంపికైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి ఎంపికైన ఏకైక టీచర్ నరేష్ ఈనెల 7,8,9 తేదీలలో రాష్ట్రస్థాయిలో కామారెడ్డి లో జరిగిన *రాజ్యస్థరీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన 2025-26* లో భాగంగా *టీచర్ ఎగ్జిబిట్* విభాగంలో తను తయారుచేసిన బోధనాభ్యాసన సామాగ్రిని ప్రదర్శనలో ఉంచారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి వచ్చిన ప్రదర్శనల అన్నిటి నుండి టాప్ లో నిలిచి ఈనెల 19 నుండి 23 వరకు సౌత్ రాష్ట్రాలు పాల్గొనే సౌత్ ఇండియా స్థాయికి తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపిక కావడం జరిగింది.

 

ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు కాపిల్ల నరేష్ మాట్లాడుతూ *నేను పిల్లలకు బోధించే సమయంలో ఉపయోగించే సామాగ్రిని ప్లాస్టిక్ వినియోగం లేకుండా కేవలం అటముక్కలు, పేపర్ లాంటి వాటితో ఎలాంటి ఖర్చు లేకుండా, తక్కువ ఖర్చుతో అతి తక్కువ సమయంలో పిల్లలు స్వయంగా ఉపయోగించుకుంటూ గణితం, తెలుగు, ఇంగ్లీష్ నేర్చుకునే విధంగా తయారు చేయడం వల్ల ఇది చాలామందికి ఉపయోగపడుతుందని ఉద్దేశంతో రాష్ట్రస్థాయి న్యాయ నిర్నేతలు నా బోధన అభ్యసన సామాగ్రిని సౌత్ ఇండియా స్థాయికి ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు.*

ఈ సందర్భంగా సౌత్ ఇండియా స్థాయికి ఎంపికైన కాపీల నరేష్ ను మండల విద్యాధికారి, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అభినందించారు.

బిజెపి వార్డ్ మెంబర్ కు సన్మానం..

బిజెపి వార్డ్ మెంబర్ కు సన్మానం

కుక్కముడి రమేష్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం బస్వారాజు పల్లి బిజెపి నుండి గెలుపొందిన సందర్భంగా యూత్ శాలువగప్పి శుభాకాంక్షలు తెలియజేశారు రమేష్ మాట్లాడుతూ నాకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించిన ఆడపడుచులకు అన్నయ్యలకు తమ్ముళ్లకు అక్కలకు చెల్లెళ్లకు నాతోటి మిత్రులకు పేరుపేరునా శుభాకాంక్షలు తెలిపారు

ఘనంగా కేంద్రీయ విద్యాలయ వార్షికోత్సవం…..

ఘనంగా కేంద్రీయ విద్యాలయ వార్షికోత్సవం…..

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం (మాచునూర్)లోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో సోమవారం 63వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోసం వివిధ ఆటల పోటీలు నిర్వహిం చారు. ప్రధానోపాధ్యాయురాలు మహేష్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆటల పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. గ్రామీణ ప్రాంతంలో నివాసం ఉంటున్న విద్యార్థుల ఉన్నత విద్య లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాటు ఉపా ధ్యాయులు హరిప్రకాష్ శుక్ల వసంత్, రిషబ్, చతుర్వేది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version