ఎన్‌ఎస్ఎస్ విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రధానం
విద్యార్థులు సమాజ సేవలో ముందుండాలి: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. రాజు
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ఇటీవలే కేసముద్రం మండలం కొత్తూరు గ్రామంలో నిర్వహించిన ఎన్‌ఎస్ఎస్ ప్రత్యేక శిబిరంలో పాల్గొన్న విద్యార్థిని, విద్యార్థులకు ప్రిన్సిపాల్ డాక్టర్ డి. రాజు సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా సమాజంలోని రుగ్మతలను అర్థం చేసుకుని, ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయంతో సమాజానికి సేవలు అందించాలని సూచించారు. ఎన్‌ఎస్ఎస్ ద్వారా పొందిన సర్టిఫికెట్లు విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రమేష్ నాయక్, అధ్యాపకులు మైసయ్య, ప్రవీణ్ కుమార్, రాజు, యాదగిరి, రవి, రమాదేవి, మున్నీ, మంజుల, సలీం తదితరులు, అలాగే బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
