వర్గ పోరాటమే ప్రత్యామ్నాయం: ఎంసిపిఐ(యు) కార్యదర్శి

వర్గ సామాజిక పోరాటాలే ప్రత్యామ్న్యాయం

నిర్మాణాత్మక ఉద్యమాలు చేపట్టాలి

ఎంసిపిఐ(యు) ముగింపు శిక్షణ తరగతుల్లో జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్

నర్సంపేట,నేటిధాత్రి:

వినాశనకర విధానాలకు వ్యతిరేకంగా వర్గ సామాజిక జమిలి పోరాటాలే ప్రత్యామ్నాయమని ఆ దిశలో ఉద్యమాలను నిర్మించాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ పిలుపునిచ్చారు. దుగ్గొండి మండలంలోని గిర్నిబావిలో
ఎంసిపిఐయు రాష్ట్రస్థాయి సైద్ధాంతిక రాజకీయ శిక్షణా తరగతులకు ముగింపులో భాగంగా వర్గాలు వర్గ పోరాటాలు సామాజిక న్యాయం అనే అంశంపై పార్టీ జిల్లా కార్యదర్శి ప్రసంగిస్తూ సమాజ చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్ర అని పార్టీ కార్యకర్తలు వర్గ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని పెట్టుబడిదారీ దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక కర్షక కూలి వర్గాలను కూడగట్టి వర్గ పోరాటాలను ఉదృతం చేయాలని కోరారు.

కార్పొరేట్ శక్తులు పెట్టుబడుదారులు దోపిడిని విస్తృతం చేసి సంపదను పెంచుకుంటున్నారని వారికి అనుకూలంగా పాలకులు చట్టాలను మారుస్తున్నారని ఈ క్రమంలో ఆర్థిక అంతరాలు పెరిగిపోయి ఎంత శ్రమించినా కనీస అవసరాలు తీరలేని పరిస్థితికి దారితీస్తుందని ఇలాంటి పరిస్థితుల్లో మార్క్సిజం చెప్పినట్లు దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గ నాయకత్వంలో శ్రామికులు ఐక్యం కాక తప్పదని అందుకు పార్టీ నాయకత్వం కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని కోరారు. కులం మతం ప్రాంతం పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజలందరికీ చెందాల్సిన సంపదను దోపిడీ చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరంతర కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. వర్గ సామాజిక ఐక్యతను పెంపొందిస్తూ వర్గ పోరాటాలను జయప్రదం కోరారు.

ఈ శిక్షణ తరగతులకు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు వంగాల రాగసుధ ప్రిన్సిపాల్ గా వ్యవహరించగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి పార్టీ కార్యక్రమం నిబంధనవళి భవిష్యత్తు కర్తవ్యాలను వివరించారు.ఈ శిక్షణ తరగతులకు వివిధ జిల్లాల నాయకత్వంతో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వల్లెపు ఉపేందర్ రెడ్డి, వనం సుధాకర్ కుంభం సుకన్య ఎన్ రెడ్డి హంసారెడ్డి మంద రవి రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబా బాబురావు గుండెబోయిన చంద్రయ్య తుడుం అనిల్ కుమార్ నర్ర ప్రతాప్ కర్ర రాజిరెడ్డి నీల రవీందర్ జబ్బర్ నాయక్ కంచ వెంకన్న కనకం సంధ్య గడ్డం నాగార్జున మాస్ సావిత్రి కర్ర దానయ్య మాలోత్ సాగర్ సుంచు జగదీశ్వర్ ముక్కెర రామస్వామి వివిధ జిల్లాల కార్యదర్శులు డివిజన్ మండల కార్యదర్శి మహమ్మద్ రజాసాహెబ్ సింగతి మల్లికార్జున్ స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మార్క్సిజం మరియు సామాజిక మార్పు: ఎంసిపిఐ(యు) రాష్ట్ర శిక్షణ ప్రారంభం

సమాజ మార్పును శాస్త్రీయంగా వివరించేదే మార్క్సిజం

ఎంసిపిఐ(యు) రాష్ట్ర క్లాసుల ప్రారంభోత్సవంలో రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి

నర్సంపేట,నేటిధాత్రి:

 

సమాజ పరిణామ క్రమాన్ని శాస్త్రీయంగా అంచనా వేసిన ఏకైక సిద్ధాంతం మార్క్సిజమేనని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అన్నారు. ఆర్థిక అసమానతలు పెరగడానికి పెట్టుబడి దారి పాలకుల విధానాలే కారణమని అందుకు దోపిడీకి గురయ్యే శ్రామికులంతా ఐక్యంగా ప్రజా పోరాటాలను నిర్మించడమే ప్రత్యామ్నాయమని తెలిపారు.భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య) రాష్ట్రస్థాయి సైద్ధాంతిక రాజకీయ శిక్షణ తరగతులు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ వంగల రాగసుధ అధ్యక్షతన గిర్నిబావిలోని జి.ఆర్.బి కన్వెన్షన్ హాల్ లో ప్రారంభమయ్యాయి.అంతకుముందు పార్టీ జెండాను పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ వల్లెపు ఉపేందర్ రెడ్డి ఆవిష్కరించారు.అనంతరం జరిగిన శిక్షణా తరగతుల్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి మాట్లాడుతూ దేశంలో కుల మత ప్రాంత ఆర్థిక అంతరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని కొద్ది మంది దగ్గర అంతులేని సంపద పోగుపడుతున్నదని శ్రామికులు ఎంత శ్రమించినా కనీస అవసరాలు తీరడం లేదన్నారు. ఈ క్రమంలో దోపిడి పెరిగి ప్రజల మౌలిక సదుపాయాలు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాలను చేస్తూ తాత్కాలిక ప్రలోభాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక పెట్టుబడిదారులతో కలిసి దోచుకు తింటున్నారని ఇలాంటి పరిస్థితులను మార్క్స్ ముందే అంచనా వేసి మార్క్సిజాన్ని రాసి సమాజానికి దిక్సూచిగా నిలిచాడని ఆయన చెప్పిన విధంగా పెట్టుబడిదారీ సమాజం తన గొయ్యిని తానే తవ్వుకుంటుందని అన్నట్లుగానే శ్రమ దోపిడీతో సంపదను పెంచుకుంటూ కష్టజీవుల కనీస అవసరాలు తీర్చకుండా నిరుద్యోగం దారిద్యం ఆకలి చావులు ఆత్మహత్యలు పెంచి పోషిస్తున్నారనివరోపించారు.ప్రజా ఉద్యమాలు బలపడకుండా అస్తిత్వ ఉద్యమాలను ప్రోత్సహిస్తూ నిర్బంధం ప్రయోగిస్తూ అధికార పబ్బం గడుపుతున్న.. ఇలాంటి పరిస్థితుల్లో సమాజ పరిణామ క్రమాన్ని సరైన పద్ధతుల్లో అవగాహన చేసుకుని వర్గ సామాజిక ప్రజా ఉద్యమాలను బలోపేతం చేసే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని పిలుపునిచ్చారు.

ఎంసిపిఐ(యు) పార్టీ క్యాలెండర్ ఆవిష్కరణ..

పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన 2026 పార్టీ క్యాలెండర్ ను పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ కోట నరసింహారెడ్డి,వల్లెపు ఉపేందర్ రెడ్డి, నాగేల్లి కొమురయ్యలతోపాటు రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్ రెడ్డి హంస రెడ్డి, కుంభం సుకన్య, తుకారాం నాయక్, రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబా బాబురావు, కనకం సంధ్య,తుడుం అనిల్ కుమార్, జబ్బర్ నాయక్, కర్ర రాజిరెడ్డి, గడ్డం నాగార్జున,మాస్ సావిత్రి, కర్ర దానయ్య,నర్ర ప్రతాప్, జిల్లా నాయకులు మాలోత్ సాగర్, చుంచు జగదీశ్వర్, ముక్కెర రామస్వామి లతోపాటు డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి, మండల కార్యదర్శి సింగతి మల్లికార్జున్ లు కలిసి ఆవిష్కరించారు.
మొదటిరోజు క్లాసు మార్క్సిజం అధ్యయనం ఆచరణ ఓంకార్ పాత్ర అనే అంశంపై పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ వల్లెపు ఉపేందర్ రెడ్డి బోధించారు.ఈ తరగతులకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version