రోడ్డు భద్రత అందరి బాధ్యత..!– ప్రతిజ్ఞ..
సిఐ డి మల్లేశం ఎస్సై ముప్పు సురేష్
(నేటి ధాత్రి): మొగులపల్లి
రోడ్డుపై ప్రయాణించే ప్రతి వాహనదారుడు సామాజిక బాధ్యతగా భద్రత చర్యలు తీసుకోవాలని చిట్యాల సిఐ డి మల్లేశం ఎస్సై ముప్పు సురేష్ అన్నారు. భూపాలపల్లిజిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక, 99 రోజుల రహదారి భద్రత… వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వాహనదారులందరూ భద్రత ప్రమాణాలను పాటించాలన్నారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, నిదానంగా ప్రయాణించడం, రోడ్డు భద్రత సూచనలు పాటించాలన్నారు. సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు.. ప్రమాద రహిత సమాజం కోసం కృషి చేయాలని కోరారు. ప్రాణాలు అమూల్యమైనవని, ప్రమాదాల నివారణను సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్నారు. ఎవరికివారు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు జరగవని, మద్యం తాగి వాహనాలను నడపవద్దని ఆయన సూచించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ జయంతి సందర్భంగా వచ్చిన వారితోవాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. వారితో కలిసి అంబేద్కర్ స్టార్చ్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ చాట్ల విజయ రవీందర్ మాజీ సొసైటీ చైర్మన్ సంపెల్లి నరసింగరావు చిట్యాల మార్కెట్ వైస్ చైర్మన్ మహమ్మద్ రఫీ మాజీ సర్పంచ్ మోటే ధర్మారావు జిల్లా నాయకులు తక్కల్లపల్లి రాజు వివిధ పార్టీల నాయకులుపోలీస్ సిబ్బందిపాల్గొన్నారు.
