కారేపల్లి నూతన తహసిల్దార్ ను సన్మానించిన మాణిక్యారం సర్పంచ్ పద్మ.
కారేపల్లి నేటిధాత్రి
సింగరేణి మండల నూతన తహసీల్దారుగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఓరుగంటి వెంకటేశ్వర్లు ను మాణిక్యారం సర్పంచ్ భూక్యా పద్మ సోమవారం పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ పద్మ మాట్లాడుతూ మండలంలోని వివిదగ్రామాల్లో పెండింగ్ లో ఉన్న రెవెన్యూ సమస్యలను వేంటనే పరిష్కరించి న్యాయంచెయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు ఖమ్మం డిసిసి బ్యాంక్ మాజీ డైరెక్టర్ ధారావత్ బద్దులాల్ తదితరులు పాల్గొన్నారు.
