బిజెపి నాయకుల ముందస్తు అరెస్ట్
కాంగ్రెస్ యాత్రను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన బిజెపి నాయకులు
అక్రమ అరెస్టులను ఖండించిన బిజెపి నాయకులు
నేటిధాత్రి ఐనవోలు :-
వర్ధన్న పేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న జనహిత పాదయాత్రను అడ్డుకోవడానికి వెళుతున్న ఐనవోలు మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు మాదాసు ప్రణయ్ పొన్నాల రాజు , బిజెపి యువమోర్చా మండల అధ్యక్షులు పులిసాగర్ గౌడ్, కట్కూరి రమేష్ లను ఐనవోలు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ప్రణయ్ మాట్లాడుతూ బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి హామీలను నెరవేర్చకుండా ప్రజల దృష్టిని మరల్చడానికి జనహిత పాదయాత్ర పేరుతో జనాలను ముంచే పాదయాత్ర చేస్తూ కాలం వెళ్లిబుచ్చే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలియజేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలని ప్రభుత్వంను ప్రశ్నించేందుకు శాంతియుతంగా వెళ్తున్న తమను ఐనవోలు పోలీసులు అరెస్ట్ చేయడాన్ని బిజెపి నాయకులు తీవ్రంగా ఖండించారు.