అక్రమ కేసు లకు భయపడేది లేదు
గుండాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దార అశోక్
గుండాల,నేటిదాత్రి:
మణుగూరు పట్టణం లో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బిఆర్ఎస్ భవనం అని పిలవబడే కార్యాలయం పైన జరిపిన దాడిని కండిస్తూ బిఆర్ఎస్ మండల నాయకులు మాట్లాడిన మాటలు చాలా హాస్యాస్పదం గా ఉన్నాయని గుండాల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దార అశోక్ అన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సహాయ సహకారాలతో కాంగ్రెస్ పార్టీ జెండాపై గెలిచి తర్వాత వారి స్వలాభం కోసం గులాబీ కండువా కప్పుకుని తల్లి పాలు తాగి రొమ్ము మీద తన్నిన మాదిరి నీ గెలుపుకి కారణమయిన కాంగ్రెస్ పార్టీ కి సంబందించిన కార్యాలయాన్ని కబ్జా చేసి బిఆర్ఎస్ భవన్ గా మార్చుకున్న మీ నాయకుడా ఈ దాడిని ఖండించేది. ఏ అధికారం లేని నాడు కూడా మా పార్టీ కార్యాలయం మాకు కావాలని పోరాడిన ఘనత మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకే సొంతం, అధికారం ఉన్నా లేకున్నా ఆ భవనం కాంగ్రెస్ పార్టీ కి మాత్రమే సొంతం, అయిదేండ్లుగా మా భవనాన్ని మాకు లేకుండా చేసి మా ఓపిక ను పరీక్షించిన మీకు మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులం అంతా కలిసి బుద్ధి చెప్పే కార్యక్రమం నిర్వహించాం, మీకు నిజంగా చిత్త శుద్ధి ఉంటే వారి కార్యాలయాన్ని నాడు కబ్జా చేసుండకపోతే నేడు ఈ పరిస్థితి మనకు రాకుండేది గా అని మీ నాయకుడ్ని ప్రశ్నించండి అని మొదట ఆజ్యం పోసిందే మీ నాయకుడు కదా అని ప్రశ్నిస్తున్నట్టు పేర్కొన్నారు. ఎలాంటి కేసులకు భయపడేది లేదని మా భవనాన్ని మేము స్వాదీన పర్చుకోవడం కూడా నేరమేనా అని ప్రశ్నించారు.ఈ కార్యక్రమం లో యూత్ కాంగ్రెస్ ఉప అధ్యక్షులు బొబ్బిలి పవన్ కళ్యాణ్, యువజన నాయకులు వాజీద్ పాషా, ఇస్రార్, బొంగు చంద్రశేఖర్, పల్లపు రాజేష్ సోషల్ మీడియా నాయకులు మండలోజు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
