అభివృద్ధి మా ధ్యేయం, ప్రజాసేవే మా లక్ష్యం..

అభివృద్ధి మా ధ్యేయం, ప్రజాసేవే మా లక్ష్యం

మండలంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే పాయం

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,, నేటిధాత్రి..

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని గురువారం నాడు పలు గ్రామపంచాయతీలలో గ్రామపంచాయతీ స్థానిక ఎన్నికల నేపథ్యంలో పర్యటిస్తున్న పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు .ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మమేకమై మాట్లాడి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు అలాగే గ్రామస్థాయి సమస్యలు పరిష్కారం పై ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు అనంతరం పాయం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల నమ్మకం అని అభివృద్ధి ద్వేయంగా ప్రజాసేవ లక్షణంగా పనిచేస్తున్నామన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి నాయకత్వం లో గ్రామాలు సమగ్ర అభివృద్ధి చెందుతాయి అన్నారు కావున కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులను వారికి కేటాయించిన గురుతులపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించుకొని గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు చంద సంతోష్ కుమార్, మండల అధ్యక్షులు సాయద్ ఇక్బాల్ హుస్సేన్, మండల నాయకులు ఎర్ర సురేష్, సాగర్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు యువకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

పీఎస్ఆర్,పీవీఆర్ యువసేన అధ్యర్యంలో పొంగులేటి జన్మదిన వేడుకలు…

పీఎస్ఆర్,పీవీఆర్ యువసేన అధ్యర్యంలో పొంగులేటి జన్మదిన వేడుకలు

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

మండలం కేంద్రంలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి బాణా సంచా పేల్చి ఘనంగా పొంగులేటి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు నిర్వహించారు.ఈ సందర్బంగా యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు దార అశోక్ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ గ్రామం నుండి అయినా అన్న అని ఒక పిలుపు ఇస్తే నేను ఉన్న అని అభయం ఇచ్చే నాయకుడు మన పొంగులేటి శ్రీనన్న అని ఆయన ఆధ్వర్యంలో మరెన్నో అభివృద్ధి పనులు జరగాలని ఆశిస్తూ ఇలాంటి జన్మ దిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని జీవితం లో మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని కోరారు.
ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నటుగా తెలిపారు.
ఈ కార్యక్రమం లో ఏఏంసి డైరెక్టర్ ఊకే బుచ్చయ్య, ఎస్ కే వాజీద్ పాషా, ఎస్కె కాసీం, నునావత్ రవి,బొంగు చంద్రశేఖర్, పల్లపు రాజేష్, గడ్డం రాజేష్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version