బాల్య వివాహాల రహిత జిల్లాగా నిలవాలి…

బాల్య వివాహాల రహిత జిల్లాగా నిలవాలి

బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలి

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి

గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించాలి

రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు ఎం చందన

హాజరైన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

సిరిసిల్ల(నేటి ధాత్రి):

 

బాల్య వివాహాల రహిత జిల్లాగా రాజన్న సిరిసిల్ల నిలవాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు ఎం చందన పేర్కొన్నారు. మిషన్ వాత్సల్యలో భాగంగా బాలల హక్కుల పరిరక్షణ, అమలవుతున్న పథకాలు, బాల్య వివాహాల నిర్మూలన తదితర అంశాలపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో వివిధ శాఖల అధికారులతో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తో కలిసి గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

మిషన్ వాత్సల్యలో భాగంగా బాల్య వివాహాలు, బాల కార్మికుల కేసులు, వారి హక్కుల పరిరక్షణ తీసుకుంటున్న చర్యలు, వివిధ అంశాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు ఎం చందన మాట్లాడారు. బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిదేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. బాల కార్మికుల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వారిని సమీప విద్యాలయాల్లో చేర్పించాలని, అనాథ పిల్లలు, ఆర్థికంగా వెనుకబడిన వారి పిల్లలను రెసిడెన్షియల్ స్కూళ్లలో జాయిన్ చేయాలని సూచించారు.

విద్యాలయాలు, హాస్టల్ లో గుడ్ టచ్.. బ్యాడ్ టచ్, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్ప్రభావాలపై, 1098 హెల్ప్ లైన్ పై అవగాహన కల్పించాలని ఆదేశించారు.

విద్యార్థులను విద్యా ద్వారా సామాజికంగా, ఆర్థికంగా రాణించేలా తీర్చిదిద్దాలని సూచించారు. అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పోషకాహారం అందించాలని, సేవలపై విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు.

అనంతరం ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని, చిల్డ్రన్ హోమ్ పనులు పూర్తి చేయిస్తామని, పిల్లల సంరక్షణ, వారి హక్కుల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

సమావేశంలో సీడబ్ల్యూసీ చైర్మన్ అంజయ్య, డీఆర్డీఓ శేషాద్రి, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, డీ వీహెచ్ఓ రవీందర్ రెడ్డి, డీఈఓ వినోద్ కుమార్, డీఎస్పీ చంద్ర శేఖర్ రెడ్డి, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్, జీసీడీఓ పద్మజ ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version