గొర్రెల మేకల పెంపకం దారులు సద్వినియోగం చేసుకోవాలి.

గొర్రెల మేకల పెంపకం దారులు సద్వినియోగం చేసుకోవాలి.

చిట్యాల, నేటిదాత్రి :

 

మంగళ వారం రోజున చిట్యాల మండలo లోని గొర్రెలు మరియు మేకలకు ఉచిత నట్టల నివారణ మందులు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథు గా గ్రామ సర్పంచ్ తౌటం లక్ష్మి – అంతులు , ఉపసర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్ పాల్గొని ప్రారంభించడం జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు ఇట్టి నట్టల నివారణ కార్యక్రమాన్ని* చిట్యాల్ మండల గొర్రెల మరియు మేకల పెంపకం దారులు*సద్వినియోగం చేసుకోవాలని అన్నారు, అలాగే చిట్యాల ప్రాంతీయ* పశువైద్య శాల అసిస్టెంట్ డైరెక్టర్ జి వెంకన్న మాట్లాడుతూ నట్టల* నివారణ మందులు త్రాగిపించుకోవడం వలన గొర్రెలు మరియు మేకల లో నత్తలు నుంచి జీవాలు రక్షణ తో పాటు ఆరోగ్యముగా, అధిక బరువు పెరగడం జరుగుతుంది అని అన్నారు,, మండల పశు వైద్య అధికారి అజయ్ అప్పని, మాట్లాడుతూ చిట్యాల* మండలం లోని దాదాపు 2000 జీవాలకు నట్టల మందు ఇవ్వడం జరిగినది అని తెలిపారు అలాగే మండలం*లోని అన్ని గ్రామాలలోని గొర్రెల మరియు మేకల పెంపకం దారులు ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా* సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల* సర్పంచ్ తౌటం లక్ష్మి- అంతులు , ఉపసర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్ లతో పాటు అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జి వెంకన్న, వెటర్నరీ సర్జన్ డాక్టర్ అజయ్ అప్పని లతో పాటు పశు వైద్య సహాయ సిబ్బంది కవిత , దివ్య , కరుణాకర్ , రాజేందర్ రెడ్డి* మరియు గొర్రెలు మరియు మేకల పెంపకం దారులు పాల్గొన్నారు.

రైతుబంధు కోసం ఎదురుచూస్తున్న జహీరాబాద్ నియోజకవర్గ రైతులు…

రైతుబంధు కోసం ఎదురుచూస్తున్న జహీరాబాద్ నియోజకవర్గ రైతులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్ ఝరాసంగం మొగుడంపల్లి నాల్కల్ జహీరాబాద్ మండల రైతులు రబీ సీజన్ పెట్టుబడి ఆర్థిక సహాయం రైతుబంధు కోసం ఎదురుచూస్తున్నారని మంగళవారం ఉదయం పలువురు రైతులు తెలిపారు. ఈ సహాయం అందజేయడంలో జాప్యం జరుగుతోందని, దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు. త్వరగా రైతుబంధు అందజేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

గొర్రెలు, మేకలకు ఉచిత నట్టల నివారణ మందు…

కథలాపూర్ మండల కేంద్రంలో ఈరోజు గొర్రెలలో మరియు మేకలలో ఉచిత నట్టల నివారణ మందు

నేటి ధాత్రి కథలాపూర్

 

ఫెర్మాండజోల్ డ్రగ్ పంపిణి చేస్తూ నెల పైబడిన అన్ని జీవాలలో కథలాపూర్ గ్రామంలో మొత్తం 1660 జీవాలకు నట్టల నివారణకు మందు పంపిని చేయడం జరిగింది.
ఇ కార్యక్రమంలో సర్పంచ్ న్యావనంది శేఖర్ ఉప సర్పంచ్ చెట్పల్లి ప్రసాద్, తాలూకా మల్లేష్
డాక్టర్ దివ్యశ్రీ మేడం,
సిబ్బంది రాజకుమార్,రసూల్
మరియు గోర్లు మేకల పెంపకం దారులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version