రైతుబంధు కోసం ఎదురుచూస్తున్న జహీరాబాద్ నియోజకవర్గ రైతులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్ ఝరాసంగం మొగుడంపల్లి నాల్కల్ జహీరాబాద్ మండల రైతులు రబీ సీజన్ పెట్టుబడి ఆర్థిక సహాయం రైతుబంధు కోసం ఎదురుచూస్తున్నారని మంగళవారం ఉదయం పలువురు రైతులు తెలిపారు. ఈ సహాయం అందజేయడంలో జాప్యం జరుగుతోందని, దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు. త్వరగా రైతుబంధు అందజేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
