
తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు.!
తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి- ఎంపీడీవో. రామడుగు, నేటిధాత్రి: వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కరీంనగర్ జిల్లా రామడుగు మండల ఎంపీడీవో రాజేశ్వరి అన్నారు. రామడుగు మండల కేంద్రంలో ఆమె మిషన్ భగీరథ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ తాగునీటి సమస్య ఉంటే గుర్తించి వెంటనే తగిన పరిష్కారం చూపాలని సూచించారు. ఈకార్యక్రమంలో డిఈ అజీముద్దీన్, ఏఈ షారోన్, ఎంపిఓ శ్రావణ్ కుమార్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.