శంషాబాద్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పెన్సిల్ చుక్కలే పవర్ ఫుల్?
`అవి చుక్కలు కాదు మూటల లెక్కలు?

`అధికారులు లంచాల వేటలో కొత్త మార్గాలు?
`ఆ రిజిస్ట్రార్ కు అందాల్సిన మొత్తాలు!

శంషాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జనం చెప్పుకుంటున్న మాటలు?
`లంచాల రూపం మారింది! ట్రస్ట్ లకు విరాళమౌతోంది?
లంచం తీసుకుంటే తప్పు..విరాళం తీసుకుంటే రైట్?
`ట్రస్టుల రూపంలో ఆస్తులు, ఇన్కమ్ టాక్స్ అధికారులు స్వాధీనం చేసుకోలేరు?
ఏసీబీ అధికారులు అధికారులు ఏం చేయలేరు?
`అవినీతి అధికారుల కనిపించని ట్రస్ట్ సేవలు?
`శంషాబాద్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏలుతున్న పెన్సిల్ చుక్కలు?
`శంషాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అడ్డగోలు వసూళ్లు?
పెన్సిల్ చుక్క ఉంటేనే రిజిస్ట్రేషన్!
`కళ్ళు ఉండి చూడలేక పోతున్న పై అధికారులు?
అన్నీ తెలిసినా ఆడిట్ డిపార్ట్మెంట్ మౌనం వహిస్తోంది?
`సబ్ రిజిస్ట్రార్ సంతకం కావాలంటే చుక్కల లెక్కలు తెలిసిందే?
`గీతల్లో వున్నది ముట్టజేప్పాల్సిందే?
`డాక్యుమెంట్ రైటర్లు చేరిపేసిన చుక్కలే అవినీతికి సాక్ష్యాలు?
`అడిట్ డిపార్ట్మెంట్ పట్టించుకోదు?
ఏసీబీ అధికారుల దాక ప్రజల గోడు వెళ్ళదు?
`ఎన్ని డాక్యుమెంట్ల పెన్సిల్ చుక్కలు చెరిపేశారో విచారిస్తే తెలుస్తుంది!
డాక్యుమెంట్ నెంబర్లు నేటిధాత్రి ఇస్తే చెక్ చేస్తామంటున్న అధికారులు?
`చెరి పేసిన చుక్కలు అధికారులకు తెలియనివా?
శంషాబాద్ లో డాక్యుమెంట్ రైటర్ లే కోట్లు కూడబెట్టుకుంటున్నారు?
`అధికారులు ఎంత సంపాదిస్తున్నారో అర్ధం చేసుకోవొచ్చు?
`శంషాబాద్ రిజిస్ట్రేషన్ శాఖలో అందరూ అవినీతి తిమింగలాలే?
`చక్రం తిప్పేదంతా డాక్యుమెంట్ రైటర్ లే?
`అమాయకుల్లా నటిస్తున్న అధికారులు?
`లంచాలు ఇచ్చుకోలేక బాధపడుతున్నామంటున్న బాధితులు?
`పెన్సిల్ చుక్కతో రిజిస్ట్రేషన్ లే తారుమారు చేస్తున్న డాక్యుమెంట్ రైటర్లు?
`ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నిత్యం అధికారులకు కాసుల పంట?
9 నెలల స్పెషల్ ఆడిట్ జరిపిస్తే అధికారుల అవినీతి చిట్టా బయటపడుతుంది!
`ఏసీబీ అధికారుల కన్నా ఒక అడుగు ముందు ఉంటున్న అవినీతి అధికారులు
`లంచాలు తీసుకోవడంలో కొత్త కొత్త మార్గాలు వెతుక్కుంటున్న లంచావతారులు?
`ఏకంగా ఒక మహిళా అధికారి ట్రస్ట్ నే ఏర్పాటు చేశారట?
ఆ అధికారి అవినీతి మార్గాలు అనేక రకాలు…ఒక్కొక్కటిగా మీ నేటిధాత్రి లో…వరుస కథనాలు!
హైదరాబాద్, నేటిధాత్రి: ప్రభుత్వ ఉద్యోగితో పనిచేయించుకోవడం మన హక్కు. అది సినిమా డైలాగ్. సినిమాలో మాత్రమే వినిపించే డైలాగ్. అది నిజంగా జనం అనలేరు. అని పనులు చేయించుకోలేరు. ఎన్నికలొచ్చిన ప్రతిసారి నాయకులు, పార్టీలు చెప్పే ఏకైక మాట. అవినీతి నిర్మూలన. రాజకీయ పార్టీలు చెప్పడం మానుకున్నది లేదు. రాజకీయ నాయకుల మాటలకు భయపడి అదికారులు లంచాలు తీసుకోకుండా వున్నది లేదు. ప్రభుత్వ పెద్దలకు తెలిసినా చేసేదేమీ లేదు. ఇంత దూరం వెళ్లిన తర్వాత లంచం గురించి మాట్లాడుకోవడం కూడా పవిత్రమైన మంత్రంగా చెప్ప్పుకునే కాలం వచ్చింది. లంచం లేకుండా అదికారులు పెన్ను కదల్చలేరు. ఆ పెన్ను కొనుగోలు కూడా లంచం లేకుండా కొనుక్కోలేరు. ఎంత మంది లంచాలు తీసుకొని పట్టుబడుతున్న ప్రభుత్వ అదికారుల్లో భయమే కనిపించడం లేదు. ఈ రెండేళ్ల కాలంలో కనీసం వెయ్యిమందికి పైగా లంచాలు తీసుకుంటూ కింది స్దాయి నుంచి పై స్దాయిదాకా అదికారులు పట్టుబడ్డారు. అయినా లంచాలు ఎక్కడా ఆగడం లేదు. నిత్యం లంచావతారి అరెస్టు అని పేపర్లో వార్తలు రావడం కూడా సహజమైపోయింది. లంచాలు తీసుకోవడం అదికారులకు అలవాటైపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే వత్తిలో లంచం కూడా భాగమైపోయింది. చిన్నదైనా, పెద్దదైనా లంచం లంచమే. అలాంటప్ప్పుడు తక్కువ ఎందుకు తీసుకోవడం అని రేటు కూడా పెంచేశారు. వందలు, వేలు దాటిపోయాయి. లక్షలు చేతిలో పెడితే తప్ప పనులు కాని లంచాల రోజులొచ్చాయి. అధికారుల అతి తెలివి వైరస్లు మ్యుటేషన్ అవుతాయన్నట్లు లంచాల రూటు రోజు రోజుకూ మారిపోతోంది. అందుకే లంచాలు తీసుకోవడంలోనే కాదు, వాటిని దాచుకోవడంలో కూడా కొత్త మార్గాలు వెతుక్కుంటున్నారు. తీసుకుంటున్న లంచం చేతితో తీసుకోకుండా, ట్రస్టులకు విరాళాý రూపంలో లంచాలు వసూలు చేస్తున్నారు. ఒకప్ప్పుడు దర్జాగా కార్యాలయంలోనే తీసకొని, టేబుల్ నింపుకునే అదికారులు లంచాల రూటు మార్చుకున్నారు. అటు పై అదికారులకు తెలియకుండా, ఏసిబికి చిక్కకుండా చూసుకుంటున్నారు. పిల్లికి బిచ్చం పెట్టని అధికారులు కూడా ఏకంగా వారి కుటుంబ సభ్యుల పేరు మీద ట్రస్టులు ఏర్పాటు చేస్తున్నారు. పనుల కోసంవచ్చిన ప్రజల చేత విరాళాలు రాయించుకుంటున్నారు. ఫలానా ట్రస్టు ప్రజలకు సేవ చేస్తుందని చెప్పి జనాన్ని మాయ చేస్తున్నారు. ఇక లంచాల రూటు మార్చుకున్నారు. స్వామి కార్యం, స్వకార్యం పూర్తి చేసుకుంటున్నారు. నిజంగా ప్రజాసేవ చేసే స్వచ్చంధ సంస్దలు జోలెపట్టుకొని తిరిగినా పది రూపాయలు విరాళాలు రాని ,ఈ రోజుల్లో అధికారుల ట్రస్టులకు మాత్రం కోట్లు వచ్చిపడుతున్నాయి. ఇదీ అసలు రహస్యం. అయితే అలా లంచాలు తీసుకోవడంలో కూడా నోటి మాట లేకుండా చూసుకుంటున్నారు. సిసి కెమెరాలకు చిక్కకుండా, ఎవరి కంటా పడకుండా వుండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శంషాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లంచాల వసూలు కొత్త పుంతలు తొక్కుతోంది. రంగారెడ్డి జిల్లా అంటేనే రియలెస్టేట్‌కు తెలంగానలోనే పెద్ద అడ్డా. అదికారులకు కాసుల పంట. రంగారెడ్డి జిల్లాలోనే శంషాబాద్ అంటే హాట్ కేక్. ఎంత చిన్న రిజిస్ట్రేషన్ చేయాలన్నా, సరే లక్షలు వచ్చిపడుతుంటాయి. ఏదో ఒక లిటిగేషన్ లేకుండా ఏ రిజిస్ట్రేషన్ రంగారెడ్డి జిల్లాలో జరగడం అసాద్యం. ఎలాంటి లిటిగేషన్ లేకపోయినా శంషాబాద్ లాంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కావడం కూడా కష్టం. ఎలాంటి రిజిస్ట్రేషన్ అయినా సరే అడిగింత ఇవ్వాల్సిందే. చుక్కలు లెక్క పెట్టుకొని, గీతలు పట్టుకొని లంచాలివ్వాల్సిందే. ఇంతకీ చుక్కలు, గీతలు ఏమిటన్న ఆలోచన ఎవరికైనా వస్తుంది. చుక్కలు అనేవి వేలల్లో వసూలు కావాల్సిన లెక్కలు. గీతలు అనేవి లక్షల్లో రావాల్సిన లంచాలు. ఏ రిజిస్ట్రేషన్‌కు ఎన్ని చుక్కలు ,ఎన్ని గీతలు పెట్టాలో సంబంధిత అధికారి పెన్నిల్తో కనిపించి, కనిపించకుండా పెట్టేస్తారు. ఆ చుక్కలు, ఆ గీతలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు వుండే డాక్యుమెంటు రైటర్లకు తప్ప మరొకరికి కనిపించవు. అంత జాగ్రత్తగా అదికారులు చుక్కలు పెట్టి డ్యాక్యుమెంటును రైటర్ల వద్దకు పంపిస్తారు. అందులో వున్న చుక్కలు, గీతలు లెక్కించి డాక్యుమెంటు రైటర్లు వసూలు చేస్తారు. ఆ డాక్యుమెంటు రైటర్లు కూడా ఎంత వసూలు చేస్తారన్నది కూడా అంతు చిక్కని రహస్యమే. అదికారులు పెట్టిన చుక్కలు, ఇచ్చిన లెక్కలు అందజేసే డాక్యుమెంటు రైటర్లకు తప్ప మూడో కంటికి తెలియవు. అవి కూడా ట్రస్టుకు ఎలా చేరుతాయన్నది కూడా అంత్యంత గోప్యంగా వుంచుతారు. అందుకే శంషాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందున్న డాక్యుమెంటు రైటర్లు కూడా కోట్లకు పడగలెత్తినట్లు చెప్ప్పుకుంటారు. డ్యాక్యుమెంటు రైటర్లే కోట్లు సంపాదిస్తే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసే అదికారులు ఎంత సంపాదించుకుంటున్నారో అంచనా వేయొచ్చు. శంషాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి తంతుపై నేటిధాత్రి ప్రశ్నిస్తే ఏ ఏ డాక్యుమెంట్లు అక్రమంగా జరిగాయన్న వాటిని మాకు అందిస్తే, వాటిపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పడం విడ్డూరం. రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు కూడా ఇదే తరహా మాటలు మాట్లాడడం మరో వింతైన విషయం. తమకేమీ తెలియదనడం, లక్షలకు లక్షలు తీసుకోవడం అలవాటుగా మారినా, తప్ప్పును కప్పిపుచ్చుకునేందకు కూడా ఏ మాత్రం వెనుకాడడం లేదు. పై స్దాయి వాళ్లకు ముట్టాల్సినవి కూడా ఎప్పటికప్ప్పుడు ముట్టుతుండడం కూడా ఇందులో భాగమే అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీడియాలో శంషాబాద్ రిజిస్ట్రేషన్కార్యాలయంలో జరుగుతున్న అవినీతి తంతుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనాన్ని జలగళ్లా పీల్చుకుతింటున్నారని విమర్శలున్నాయి. అయినా శాఖ పెద్దలు కదలిందిలేదు. ప్రతి మూడు నెలýకోసారి రిజిస్ట్రేషన్ శాఖలో జరిగే డాక్యుమెంట్లపై ఆడిట్ జరగాలి. కాని రంగారెడ్డి జిల్లాలో గత తొమ్మిది నెలలుగా కూడా ఆడిట్ జరగడం లేదని తెలుస్తోంది. ఈ తొమ్మిది నెలల కాలంలో జరిగిన రిజిస్ట్రేషన్లపై ఆడిట్ డిపార్టుమెంటు ప్రత్యేక దష్టిపెడితే జరిగిన అవినీతి బండారమంతా బైట పడుతుందని అంటున్నారు. అయితే ఇక్కడ ఏసిబి అదికారులకు ఏ మాత్రం చిక్కకుండా శంషాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయ అదికారులు జాగ్రత్తపడుతున్నారు. లంచాల బాగోతమంతా డాక్యుమెంటు రైటర్లు చూసుకుంటున్నారు. లంచాలన్నీ ట్రస్టులకు విరాళాలుగా రాస్తున్నారు. దాంతో ఏసిబికి చిక్కే అవాకాశం కనిపిండచం లేదు. అందుకే శంషాబాద్‌లో రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందుండే డాక్యుమెంటు రైటర్ల రోజు వారి ఆర్థిక లావాదేవీల లెక్కలు చూస్తే అసలు బండారమంతా బైటపడుతుంది. నిత్యం వారి అకౌంట్లలోకి ఎంత వస్తోంది. ఆ అకౌంట్ల నుంచి ఎంత అధికారులు సూచించే ట్రస్టులకు చేరుతుందనేది అణాపైసాతో సహా లెక్కలు తేలుతాయని అంటున్నారు. ఆడిట్ డిపార్టుమెంటు ఎలాగూ చర్యలకు ఉపక్రమించడం లేదు. పై స్దాయి నుంచి వుండే ఒత్తిళ్లు వారికి వున్నాయి. అందుతున్న లెక్కలు కూడా కనిపిస్తున్నాయి. అందుకే అదికారులను ఆడిట్ అధికారులు వెనకెసుకొస్తున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అందువల్ల ఏసిబి రంగంలోకి దిగి నేరుగా వసూలు కార్యాక్రమాలపై మాత్రమే కాకుండా ఇలా ట్రస్టుల పేరుతో జరుగుతున్న అవినీతి తంతుపై కూడా దష్టిపెట్టాలి. శంషాబాద్ రిజిస్ట్రేషన్కార్యాలయ సాక్షిగా సాగే లంచాల వసూలుకు నాణానికి ఇది ఒక వైపు మాత్రమే. మరో వైపు మరో పెద్ద కథ వుంది. అది మరో ఎపిసోడ్లో మీ నేటిధాత్రిలో…
