జల్ జీవన్ మిషన్ అమలు

*తిరుపతి జిల్లాలో తాగునీటి సరఫరాపై

తిరుపతి ఎంపీ గురుమూర్తి ప్రశ్న.

తిరుపతి(నేటి ధాత్రి) ఫిబ్రవరి 14:

లోక్‌సభలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల శక్తి శాఖా సహాయ మంత్రి వి.సోమన్న సమాధానం ఇచ్చారు. తిరుపతి జిల్లాలో జల్ జీవన్ మిషన్ అమలుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఇంటికి తాగునీటి కనెక్షన్‌లను అందించడమే లక్ష్యంగా 2019 ఆగస్టులో ఈ పథకం ప్రారంబించారని తెలిపారు.ఈ కార్యక్రమం ప్రారంభ సమయానికి తిరుపతి జిల్లాలో కేవలం 2.40 లక్షల గ్రామీణ ఇళ్లకు (57.58%) త్రాగు నీటి కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. అయితే,గత అయిదేళ్లలో 1.76 లక్షల కొత్త కనెక్షన్లు అందించారని, ప్రస్తుతం 4.16 లక్షల ఇళ్లకు (99.82%) తాగునీటి కనెక్షన్లు అందించబడ్డాయని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాల వారీగా చూసినట్లయితే 1.19 లక్షల ఎస్సీ, 26 వేల ఎస్టీ కుటుంబాలకి త్రాగునీటి కనెక్షన్లు ఇప్పటి వరకు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. ఓబిసిలకి సంబందించిన సమాచారం అందుబాటులో లేదని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలు అధికంగా ఉన్న ప్రాంతాలలో కనెక్షన్ల కవరేజ్ గరించి వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం తిరుపతి జిల్లాలో మొత్తం 4,018 హ్యాబిటేషన్లు ఉండగా వాటిలో 487 ఎస్టీ,1,331 ఎస్సీ హ్యాబిటేషన్ గా గుర్తించబడ్డాయని పేర్కొన్నారు. వీటిలో 09.02.2025 నాటికి 485 ‘ఎస్టీ, మరియు1,328 ‘ఎస్సీ హ్యాబిటేషన్లు పూర్తి స్థాయిలో కనెక్షన్ లు అందించా
బడ్డాయని తెలిపారు.అలాగే తాగునీటి నిర్వహణలో గ్రామస్థాయి ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు గ్రామ నీటి, పారిశుద్ధ్య కమిటీల ఏర్పాటు ప్రోత్సహిస్తున్నామని తెలియజేశారు. తిరుపతి జిల్లాలోని 908 గ్రామాలలో 901 గ్రామాలకు గ్రామ నీటి,పారిశుద్ధ్య కమిటీ ఏర్పాటు చేయబడ్డాయని తెలిపారు. ఇందులో 50% కమిటీ సభ్యులు మహిళలు కావడం గమనార్హమని అన్నారు.ఈ కమిటీలలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం ప్రాధాన్యం కల్పించామనీ తెలిపారు.
ఈ పథకం ప్రారంబించే సమయానికి ఆంధ్రప్రదేశ్‌లో 30.74 లక్షల (32.18%) గ్రామీణ ఇళ్లకు మాత్రమే తాగునీటి కనెక్షన్లు అందుబాటులో ఉండగా, 2025 ఫిబ్రవరి 9 నాటికి ఈ సంఖ్య 70.46 లక్షల (73.76%)కు చేరిందని పేర్కొన్నారు. ప్రతి గ్రామీణ ఇంటికి 55 లీటర్ల తాగునీరు రోజుకు అందించే లక్ష్యం కోసం జల్ జీవన్ మిషన్ వేగంగా పురోగమిస్తోందని ఈ లక్ష్య సాధన కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక & సాంకేతిక సహాయం అందిస్తూనే ఉందని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!