Kakatiya Kala Jathara Poster Launch in Mogullapally
సామాజిక చైతన్యానికి కలలు ఎంతో దోహదపడతాయి.
మొగుళ్ళపల్లిలో ప్రముఖులచే “కాకతీయ కళల జాతర”పోస్టర్ ఆవిష్కరణ
మే 2,3 తేదీల్లో జరిగే సాంస్కృతిక పోటీలో మండల కళాకారులకు ఆహ్వానం.
చేతన కళావేదిక సభ్యులు నిమ్మల వెంకటేష్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అధికారులు స్థానిక కళాకారులు మరియు చేతన కళా వేదిక సభ్యులు నిమ్మల వెంకటేష్ ఆధ్వర్యంలో “కాకతీయ కళల జాతర” పోస్టర్ ను ఆవిష్కరించారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తహసిల్దార్ జాడి సునీత మాట్లాడుతూ.. ఓరుగల్లు కళా సంపదను కాపాడుకునేందుకు “కాకతీయ కళల జాతర” మహా సాంస్కృతిక సమ్మేళనం లాంటి ఈవెంటని ఇది అందరికీ ఉపయోగపడుతుందని అన్నారు.
మండలం నుండి కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొని మంచి పేరు తీసుకురావాలని కోరారు.ఎంపీడీవో సురేందర్ మాట్లాడుతూ
కాకతీయ కళా వైభవానికి మరియు సామాజిక చైతన్యానికి కలలు ఎంతో దోహదపడతాయని దానికోసం యువ కళాకారులు ముందుకు రావాలని ఈ ఈవెంట్లలో కళాకారులు, విద్యార్థులు వారు పెట్టే పోటీల్లో పాల్గొని మన మండలాన్ని ముందు వారసులు ఉంచి బహుమతులు తీసుకోవాలని అన్నారు.
మే నెల 2 &3 తేదీలలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ కళారూపాలకు హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ హ్యుమానిటీస్ బిల్డింగ్లో పోటీలు ఉంటాయి అనీ, ఇందులో విజేతలైన కళాకారులకు మే నెల 8, 9,10 తారీకులలో జరగబోతున్న “కాకతీయ కళల జాతర” మహా సాంస్కృతిక సమ్మేళనం కార్యక్రమంలో విభాగాల వారీగా బహుమతి ప్రధానం ఉంటుంది.
ఎలాంటి ఎంట్రీ ఫీజులు లేకుండా 5000/- నుండి 50,000/- వరకు నగదు బహుమతుల ప్రోత్సహించే ఇలాంటి కార్యక్రమాలకు కళాకారులు తరలిరావాలని నిమ్మల వెంకటేష్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై ముప్పు సురేష్ మెడికల్ ఆఫీసర్ ఐసిడిఎస్ సూపర్వైజర్ రజిత తోపాటు అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు మంగళపల్లి శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ నిమ్మల భద్రయ్య , ఎల్లారెడ్డిపల్లి సర్పంచ్ నల్ల అరుణ లింగారెడ్డి, వేములపల్లి సర్పంచ్ రమేష్ , స్థానిక కళాకారులు బుర్రసాగర్, కట్ల శ్రీను, ఒనపాకల దయాకర్, కళ్లెపెల్లి సురేందర్, వనపర్తి నాగరాజు, కట్ల నరేంద్ర, కుమ్మరి రామకృష్ణ లు తదితరులు పాల్గొన్నారు.
