ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి
అదనపు కలెక్టర్ విజయలక్ష్మి
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి రూరల్ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి రాంపూర్ గ్రామాన్ని సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా లబ్ధిదారులతో అదనపు కలెక్టర్ మాట్లాడి ఇళ్ళ నిర్మాణ పనులు పురోగతిని, గృహ నిర్మాణ బిల్లుల చెల్లింపు వివరాలను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.
ఇండ్ల పనులు త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు ఆమె ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్న ప్రతి అర్హుడికి సొంత గృహం అందించే కార్యక్రమం విజయవంతం కావాలంటే అధికారులు సమన్వయంతో పనిచేయాలని విజయలక్ష్మి సూచించారు, అంతేకాక ప్రాథమిక పాఠశాల అంగన్వాడి సెంటర్లను కూడా తనిఖీ చేసి లోటుపాట్లను సరిదిద్దుకోవాల్సిందిగా సూచించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తరుణి ప్రసాద్ ఎంపీఓ నాగరాజు పంచాయతీ కార్యదర్శి దేవేందర్ ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది
