ఆర్ట్స్ కళాశాలలో 15, 16 తేదీలలో డిగ్రీ స్పాట్ అడ్మిషన్.
సుబేదారి, నేటి దాత్రి
హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 2025 -26 విద్యా సంవత్సరానికి గాను బీఏ, బీకాం ,బీఎస్సీ, బి ఎ (ఆనర్స్) మొదటి సంవత్సరంలో అడ్మిషన్ కోసం ఈనె 15 ,16 తేదీలలో స్పాట్ అడ్మిషన్ నిర్వహించబడుతుందని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు. స్పాట్ అడ్మిషన్ కు వచ్చే విద్యార్థులు సంబంధిత సర్టిఫికెట్లు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టిసి) టెన్త్ మేమో, ఇంటర్మీడియట్ మేమో, కుల ధ్రువీకరణ పత్రం, బోనఫైడ్ సర్టిఫికెట్లు ఏడవ తరగతి నుండి 12వ తరగతి వరకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీని కూడా వెంట తీసుకొని రావాలని, అదేవిధంగా స్పాట్ అడ్మిషన్ పొందిన విద్యార్థులు వెనువెంటనే సంబంధిత కోర్సు ఫీజును చెల్లించాలన్నారు. స్పాట్ అడ్మిషన్ లో సీటు పొందిన విద్యార్థుల కు స్కాలర్షిప్, రియంబర్స్మెంట్ అవకాశం ఉండదని పేర్కొన్నారు. ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు అడ్మిషన్ ప్రక్రియ నిర్వహించబడుతుందన్నారు.